Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకి వారమంతా సూపర్.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Horoscope: ఈ వారం అనగా ఆగస్టు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి వారమంతా చాలా బాగుంది. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

కర్కాటక రాశి.. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. పలు మార్గాల్లో ఆర్థికవృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లోవారి సూచనలు అవసరం. కలసికట్టుగా పనిచేయాలి. వారాంతంలో అభీష్టసిద్ధి ఉంది. సూర్య నమస్కారం శుభప్రదం.

Advertisement

వృశ్చిక రాశి.. శుభకాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుమార్గాల్లో విజయం సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో ప్రతిభ చూపి గుర్తింపు పొందుతారు. ఆశించిన స్థాయికి ఎదుగుతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య కార్యాలపై దృష్టి పెట్టి సదా అభివృద్ధినే కాంక్షించండి. వృథా కాలక్షేపం చేయవద్దు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Advertisement
Advertisement