Telugu NewsLatestjanaki kalaganaledu Oct 18 Today Episode : జానకికి జాగ్రత్తలు చెప్పిన జ్ఞానాంబ..విష్ణుని రెచ్చగొట్టిన...

janaki kalaganaledu Oct 18 Today Episode : జానకికి జాగ్రత్తలు చెప్పిన జ్ఞానాంబ..విష్ణుని రెచ్చగొట్టిన మల్లిక..?

 janaki kalaganaledu Oct 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి, రామ చంద్ర ఇద్దరు జెస్సి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో జానకి రామచంద్ర తో ఈ విషయం అత్తయ్య గారికి తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సి బయటికి రావడంతో అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. మరొకవైపు మల్లిక తింటూ ఉండగా గోవిందరాజు, జ్ఞానాంబ అక్కడికి వస్తారు. అప్పుడు గోవిందరాజులూ కొద్దీసేపు వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటారు.

Advertisement
 janaki kalaganaledu Oct 18 Today Episode
 janaki kalaganaledu Oct 18 Today Episode

అప్పుడు జ్ఞానాంబ చికితను పిలిచి ఈరోజు నుంచి ఏ పనులైనా నువ్వే చూసుకోవాలి చికిత జానకి అసలు పని చేయడానికి వీలులేదు. అప్పుడు జానకి గురించి అడగగా జానకి అమ్మగారి ఇంట్లో లేరమ్మ జెసి అమ్మ గారిని తీసుకొని బయటికి వెళ్లారు అని చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ తనతో జానకికి ఏం పని ఉంది అని ఆలోచనలో పడుతుంది.

Advertisement

అవకాశం దొరికింది కదా అని మల్లికా జానకి పై లేనిపోని చాడీలు చెబుతూ ఉంటుంది. అత్తయ్య గారు మీరు ఉన్నప్పుడు చదువుతున్నట్టు నటిస్తుంది తర్వాత మీరు వెళ్ళాక జెస్సి తో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు అమ్మ పుల్లల మల్లిక నువ్వు పుల్లలు పెట్టడం ఆపు అని అంటుండగానే అంతలో అక్కడికి జానకీ వస్తుంది.

Advertisement

Janaki Kalaganaledu : జ్ఞానాంబ ముందే జానకిని అవమానించిన మల్లిక.. 

అపుడు జ్ఞానాంబ ఎక్కడికి వెళ్లారు జానకి అని అడగగా నాకు కొన్ని నోట్స్ లు అవసరమయ్యాయి అత్తయ్య అందుకే జెస్సిని తోడుగా పీల్చుకుని వెళ్లాను అని చెబుతుంది జానకి. అప్పుడు మల్లిక అవునా అలా అయితే నోట్స్ లు చూపించు అని అనగా ఇంతలోనే ఆ ఊరి పెద్ద మనుషులు అక్కడికి వస్తారు. దసరా మామూలు అడగడంతో జ్ఞానాంబ జానకి చేతుల మీదుగా డబ్బులు ఇప్పించడంతో అది చూసి మల్లిక కుల్లుకుంటూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత రామచంద్ర, జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి అమ్మ ఈనెల డబ్బులు ఇదిగో అని ఇస్తూ ఉండగా అప్పుడు గోవిందరాజులు చూశావా జ్ఞానాంబ మన పిల్లలు ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా అంతా మనకోసమే వచ్చేస్తున్నారు అని అనగా అప్పుడు రామచంద్ర అమ్మ నీకు జానకి గారు ఒక విషయం చెప్పమన్నారు. పుట్టబోయే పిల్లల కోసం ఇప్పటినుంచి కొంచెం డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవసరాలకు పనికొస్తాయని చెప్పారు అని అనగా అప్పుడు జ్ఞానాంబ జానకి గురించి మనసులో గొప్పగా అనుకోని రామా చేతికి డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తుంది.

Advertisement

అప్పుడు జరిగిన విషయం జానకికి చెప్పి రామచంద్ర డబ్బులు బీరువాలో దాచండి అని ఇస్తూ ఉండగా అది చూసిన మల్లిక దొంగగా వీడియో తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీడియోని విష్ణుకు చూపించినే లేనిపోనివ్వని చెప్పి విష్ణు ని రెచ్చగొడుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం జానకి దగ్గరకు వెన్నెల వచ్చి వదిన నాకు చెప్పడం వల్లే నేను బాగా చదువుకొని ఎగ్జాంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను అమ్మ నన్ను పొగిడింది అంటూ సంతోషంగా చెబుతూ ఉంటుంది.

Advertisement

వెన్నెల అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రామా జానకి తో, మీరు చదువుని పక్కనపెట్టి తనకు చదువు చెప్తున్నారంటే ఏదో కొంచెం బాధగా ఉండేది కానీ తన ఆనందంతో ఆ బాధ తీరిపోయింది అని అంటుంది. ఆ తర్వాత నేను కూడా మీతో బ్యాంకు వస్తాను రామ గారు డిపాజిట్ చేసేద్దామని జానకి అంటుంది. అప్పుడు రామ విష్ణు దగ్గరికి వెళ్లి ,అమ్మ డబ్బు గురించి నీకు ఏమైనా చెప్పిందా అని అనగా లేదు అని విష్ణు కోపంగా అంటాడు. అమ్మ దేవుడి గదిలో ఉన్నది కదా అయితే నువ్వు నీ డబ్బుని ఇస్తే అని రామా అనే లోగా మల్లిక మధ్యలో ఆపి ఆ మేమెందుకు ఇవ్వాలి మీరు మాత్రం బ్యాంకులో మీ అవసరాల కోసం దాచుకోండి మేం మాత్రం మీకు ఇచ్చేయాలని అంటుంది. ఈ మాటలు దేవుడి గదిలో ఉన్న జ్ఞానాంబ వింటుంది.

Advertisement

Read Also : janaki kalaganaledu Oct 17 Today Episode : మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి.. కడుపు నొప్పితో అల్లాడుతున్న జెస్సి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు