janaki kalaganaledu Oct 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి కీ జ్ఞానాంబ ఉంగరం దొరుకుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో గోవిందరాజులు,జ్ఞానాంబ మన పెళ్లినాటి తొలి ఉంగరం అనడంతో ఆ ఉంగరం చూసి జ్ఞానాంబ సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు ఇదంతా జానకి వల్లే అంటూ జానకీని పొగుడుతూ ఉంటాడు. అది చూసి అందరూ ఆనంద పడుతూ ఉండగా మల్లికా మాత్రం ఆ క్రెడిట్ అంతా నాదే జానకిని చెడ్డ చేయాలని చూస్తే దానికి మంచే జరిగింది ఇదంతా నా దురదృష్టం అని కుళ్ళుకుంటూ ఉంటుంది.

అప్పుడు జ్ఞానాంబ వాళ్లు ఆ తులసి కోట గురించి చూసుకోమని జానకి దంపతులకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు రామచంద్ర ఏంటి జానకి గారు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పడంతో జానకి, తన మాటలతో రామచంద్ర కు నచ్చచెబుతుంది. మరొకవైపు మల్లిక జరిగిన విషయం గురించి తలుచుకుని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి జానకి వచ్చి ఏం సాధిద్దామని ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు మల్లిక అని అంటుంది.
అప్పుడు జానకి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు తులసి కోటను పడేయడం నేను రామచంద్ర గారు చూసాము ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాను అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో అని అంటుంది జానకి. ప్రతిసారి ఇలాగే చేస్తే వార్నింగ్ తో ఊరుకుంటున్నాను అని అస్సలు అనుకోకు ఇంకొక సారి ఇలా చేస్తే బాగుండదు అని మల్లికకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జానకి.
Janaki Kalaganaledu అక్టోబర్ 17 ఎపిసోడ్ : ఆ ఉంగరం చూసి మురిసిపోయిన జ్ఞానాంబ, గోవిందరాజు..
ఇంతలో విష్ణు అక్కడికి వచ్చి ఏం జరిగింది మల్లిక అని అనడంతో మల్లిక జానకి పై లేనిపోని చాడీలు చెప్పి జానకి గురించి తప్పుగా చెబుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక, విష్ణుకి జానకి రామచంద్రపై లేనిపోనివ్వని చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది. మరొకవైపు జ్ఞానాంబ ఆ ఉంగరం చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి గోవిందరాజులు వస్తాడు. ఇద్దరు కలిసి సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి కోసం ఒక ఆవిడ వస్తుంది.
అప్పుడు జానకి వాళ్ళ మేడం ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వు అందరికంటే నువ్వే బాగా చదివే దానివి నువ్వు ఐపీఎస్ అయ్యి మా కాలేజ్ కు మంచిర్యాంకు తీసుకొని రావాలి అని చెప్పడంతో జ్ఞానాంబ వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు జానకి వాళ్ళ మేడం వెళ్లిపోయిన తర్వాత జ్ఞానాంబ మరిన్ని జాగ్రత్తలు చెప్పే సంతోష పడుతూ ఉండగా అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి చదువుకుంటూ ఉండగా మరొకవైపు జెస్సి బట్టలు సర్ది పెడుతూ ఉంటుంది.
అప్పుడు ఉన్నపలంగా జెస్సి కి ఒక్కసారిగా కడుపునొప్పి వస్తుంది. అక్క అని గట్టిగా అరుస్తున్న జానకి వినిపించుకోకుండా చదువుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెస్సి నొప్పితో జానకి దగ్గరికి అరుచుకుంటూ వస్తుంది. దాంతో జానకి వెంటనే రామచంద్ర కి ఫోన్ చేసి జెస్సి బాగాలేదు నేను ఇలా వస్తాము మీరు అలాగే రండి అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత రామచంద్ర,జానకి ఇద్దరు కలిసి జెస్సిని హాస్పిటల్ కి పిల్చుకొని వెళ్తారు.
ఆ తర్వాత డాక్టర్ చెక్ చేస్తూ ఉండగా రామచంద్ర జానకి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ అక్కడికి వచ్చి కడుపులో పెడుతున్న బిడ్డసరిగా గ్రోత్ అవడం లేదు అని చెప్పడంతో జానకి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు బిడ్డ కడుపులో ఉన్నంత వరకు ఏం చేయలేము బిడ్డ పుట్టిన తర్వాత వారి కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అని డాక్టర్ చెప్పడంతో జానకి సరే అని అంటుంది.
డాక్టర్ తో ఆ విషయాన్ని మా అత్తయ్య గారికి తెలియకుండా ఉండాలి అని మాట తీసుకుంటుంది. ఆ తర్వాత రామచంద్ర,జానకి బయటికి వచ్చి జ్ఞానాంబ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు రామచంద్ర అమ్మ అడిగితే ఏం చెప్తారు జానకి గారు అంటే ఏదో ఒకటి చెప్పాలి రామచంద్ర గారు అని రామచంద్రకి ధైర్యం చెబుతూ ఉంటుంది జానకి.