Karthika Deepam Aug 13 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, హిమ ఇద్దరు పెళ్లి అయిన ఆపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ హిమ ఎలా అయినా పెళ్లి ఆపాలి అని ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ ఈ పెళ్లి ఆగిపోవాలి అంటే నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి హిమ అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే సౌందర్య అక్కడికి వచ్చి ఏంటి హిమ ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్లి తొందరగా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి అని అంటుంది.
మరొకవైపు శౌర్య అందంగా చీర కట్టుకొని ముస్తాబవడంతో అది చూసి ఆనందరావు పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఆనందరావు ఇంతకీ సౌర్య నీ జీవితంలోకి ఆటో ఎలా వచ్చింది అని అడగడంతో అప్పుడు సౌర్య గతంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆనందరావు చెబుతుంది. సౌర్యకి వారణాసి ఆటో నేర్పిస్తాడు. అలా ఆ సౌర్య గతంలో జరిగినదంతా ఆనందరావుకి వివరించగా..
అప్పుడు ఆనంద్ రావు నువ్వు ఏమి అనను అంటే ఒక విషయం చెప్తాను అనడంతో ఏంటి తాతయ్య అని అనగా ఆ వారణాసిని నేనే పంపించాను అని అనగా వెంటనే సౌర్య అయితే మీరు నన్ను చిన్నప్పటినుంచి మోసం చేయడం మొదలు పెట్టారా అని అనగా ఇంతలోనే సౌందర్య అక్కడికి వచ్చి సౌర్య చెంప చెల్లుమనిపిస్తుంది.
ఆ తర్వాత సౌర్య,హిమ లను గుడికి బయలుదేరమని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సౌందర్య. మరొకవైపు నిరుపమ్,హిమ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు ప్రేమ్ వీడికి కనపడితే ఏం జరుగుతుంది ఎందుకు అలా ఉన్నావు అని పదేపదే అడుగుతాడు అని మనసులో అనుకుంటూ అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో నిరుపమ్, ప్రేమ్ ని ఉండమని చెప్పి పిలుస్తాడు. ఇంతలోనే నిరుపమ్ కి హిమ కాల్ చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఒక హాస్పిటల్ లో బెడ్ పై దీప చికిత్స తీసుకుంటూ ఉంటుంది. అయితే గతాన్ని తలుచుకున్న వంటలక్క ఒక్కసారిగా డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది.
Read Also : Karthika Deepam : కార్తీకదీపంలో వంటలక్క రీ-ఎంట్రీ.. డెత్ బెడ్‌పై నుంచి లేచి అతని పేరు పిలిచిన దీప!