Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ గతంలో కంటే ప్రస్తుతం రేటింగ్ తగ్గిందనే చెప్పాలి. ఈ విధంగా ఈ సీరియల్ కి రేటింగ్ తగ్గడానికి కారణం ఈ సీరియల్ నుంచి ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్కను తొలగించడమే అని చెప్పాలి. ఈ సీరియల్ లో దీప పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న దీపా పాత్రను చనిపోయినట్టు చూపించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దీపను ఒక్కసారిగా ఈ సీరియల్లో చనిపోయినట్లు చూపించడంతో అభిమానులు దీప లేని సీరియల్ చూడలేం అంటూ చెప్పకనే చెప్పేశారు.

Karthika Deepam
ఈ క్రమంలోనే ఈ సీరియల్లో దీప పాత్ర తొలగిపోవడంతో సీరియల్ చూసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. ఎలాగైనా తిరిగి ఈ సీరియల్ లోకి వంటలక్కను తీసుకువస్తే బాగుండేది అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే దీప ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అదేవిధంగా గత రెండు రోజుల క్రితం ప్రేమి విశ్వనాథ్ తన సోషల్ మీడియా వేదికగా వస్తున్న మీకోసం అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు తప్పకుండా దీప రీ ఎంట్రీ ఇస్తుందని భావించారు.
Karthika Deepam: కార్తీకదీపంలో వంటలక్క రీ-ఎంట్రీ
ఇదిలా ఉండగా తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రసారమవుతున్న సమయంలో ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేశారు.ఈ వీడియోలో భాగంగా హాస్పిటల్లో దీప బెడ్ పై కోమాలో ఉండగా తనకు కారు యాక్సిడెంట్ అయి లోయలో పడిపోవడం అన్ని గుర్తుకు వచ్చాయి. ఇలా అన్ని గుర్తుకు రావడంతో ఒక్కసారిగా డాక్టర్ బాబు అంటూ కళ్ళు తెరిచి లేచినట్టు చూపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఎట్టకేలకు వంటలక్క తిరిగి వచ్చేసిందోచ్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తిరిగి కోమాలో నుంచి బయటకు వచ్చినట్టు దీపను చూపించారు. మొత్తానికి దీప రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోతాయి అనడంలో సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.
Read Also : Karthika Deepam Aug 12 Today Episode : హిమ పై కోప్పడిన సౌందర్య.. పెళ్లి ఆపే ప్రయత్నంలో ప్రేమ్, హిమ..?