Intinti Gruhalashmi : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తులసికి లోన్ ఇవ్వడం కోసం అధికారులు మళ్లీ వస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో తులసికి లోన్ ఇవ్వడానికి వచ్చిన అధికారులు మాయమాటలు చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ పై సైన్ చేయించుకుంటారు. కానీ తులసి మాత్రం ఎందుకు టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. మరొక వైపు నందు స్నేహితుడు తన ఇంటికి రావడంతో నందుకు ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అతను నువ్వే పిలిచావు కదా అని అనగా నందు ఆశ్చర్యపోతాడు.
ఇంతలో లాస్య అక్కడికి వచ్చి నేనే పిలిచాను అని నందు స్నేహితుని కూర్చోబెట్టి అతనితో మాట్లాడుతూ ఎలా అయినా మీకు కావాల్సిన అమౌంట్ ని ఇస్తాను అని నందు స్నేహితునికి మాట ఇస్తుంది. నన్ను మాత్రం లాస్య ఏం చేస్తుందో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతే కాకుండా నందుని వాళ్ళ ఫ్రెండ్ తో అగ్రిమెంట్ తీసుకుని లాస్య చెబుతుంది.
అప్పుడు నందు లాస్యను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకువస్తావు అని అనటంతో వెంటనే లాస్య వచ్చే డబ్బులు ఎలాగ వస్తాయి. అని నందుకు ధైర్యం చెబుతుంది. మరొకవైపు అభి ప్రేమ్ ఇంటికి వెళ్లి ఎలా అయినా తులసి ఒప్పించి అంకితను తన పుట్టింటికి వచ్చేలా చెయ్యమని చెబుతాడు.
అప్పుడు ప్రేమ నాతో కూడా అమ్మ మాట్లాడటం లేదు కదా అని అనగా అప్పుడు అభి తులసి గురించి తప్పుగా మాట్లాడడం తో ప్రేమ్ కోప్పడతాడు. అప్పుడు అభి అంకిత పుట్టింటికి వస్తే నీకు ఆల్బం కు కావాల్సిన అయిదు లక్షలు నేను చెప్తాను అని అనటంతో వెంటనే ప్రేమ్ డీల్ కుదుర్చుకుంటున్నావా అని అంటాడు.
అప్పుడు శృతి ఈ విషయంలో మేము కలుగజేసి కోకుండా ఉంటేనే బాగుంటుంది ఈ విషయాన్ని మీరే పరిష్కరించుకోండి అని అనటంతో అప్పుడు అభి, ఇంటికి వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావు అని ప్రేమ్ పై ఫైర్ అవుతాడు. మరొకవైపు తులసి డబ్బులు వస్తుంది అన్న ఆనందంలో ముందుగానే ప్లాన్ లు వేస్తూ ఉండగా ఆనందపడుతూ ఉంటుంది.
ఇంతలోనే కుటుంబ సభ్యులు రావడంతో వారికి అసలు విషయాన్ని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. మరొకవైపు నందు లాస్యలు కూడా ఆనంద పడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Read Also : Intinti Gruhalakshmi june 23 Today Episode : లాస్య చేతిలో మోసపోయిన తులసి.. సంతోషంలో ప్రేమ్..?