ఈరోజు ఎపిసోడ్ లో నందు మ్యూజిక్ వింటూ ఉండగా లాస్య చిరాకు పడుతుంది. నీకు మ్యూజిక్ అంటే ఇష్టం కదా అని అనగా ఒకప్పుడు ఉండేది మీ తులసి మ్యూజిక్ విని నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పోయింది అని అంటుంది. ఆ తర్వాత నీకు ఒక మాట చెప్పాలి నందు అని చెప్పి తులసి త్వరలోనే ఒక మ్యూజిక్ స్కూల్ ని పెట్టబోతోంది అందుకోసం తాను కూడా లోన్ తీసుకుంటోంది అని చెప్పడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఆ తర్వాత అదే విషయం గురించి నందు లాస్య కాసేపు వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు నందు అక్కడినుంచి కోపంగా వెళ్లిపోగా వెంటనే లాస్య పాపం తులసి నువ్వు మాకు అడ్డు పడకపోతే నీ జోలికి వచ్చే వాళ్ళం కాదు కదా అని నవ్వుతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ డబ్బులు వస్తుంది అన్న నమ్మకంతో మ్యూజిక్ కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అని లిస్టు రాసుకుంటూ ఉంటాడు.
అప్పుడు శృతి డబ్బు వచ్చిన తర్వాత ఆర్డర్ చేస్తే సరిపోతుంది కదా అని అనడంతో ఆ మాటకు ప్రేమ్ అర్థం ఏమిటి అంటూ కాసేపు శృతితో వాదిస్తాడు. ఆ తర్వాత శృతి డబ్బులు తీసుకుని వస్తాను అని చెప్పి తులసి ఇంటికి బయలుదేరుతుంది. మరొక వైపు ఇంట్లో అందరూ తులసి ని మాట్లాడిస్తున్నా కూడా తులసి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది.
అప్పుడు అంకిత ఏమయింది ఆంటీ అని మేము మాట్లాడించిన పలకకుండా మొబైల్ వైపు అలా చూస్తున్నారు అని అనగా మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను అంకిత అని చెబుతుంది. అప్పుడు తులసి ఎదురు చూసినట్టుగా బ్యాంకు నుంచి డబ్బులు పడినట్లు మెసేజ్ రావడం తో అందరూ ఒక్కసారిగా సంతోష పడుతూ ఉంటారు.
అప్పుడు వెంటనే తులసి, శృతికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను తొందరగా రమ్మని చెప్పడంతో అప్పుడు శృతి వస్తున్నాను అని ఆనందపడుతుంది. ఇంతలోనే డబ్బులు పోయాయి అని మరొక మెసేజ్ రావడం తో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు తులసి డాక్యుమెంట్స్ చూపించడంతో ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెబుతుంది అంకిత.
అలా మొత్తానికి తాను మోసపోయాను అని అనుకుంటుంది తులసి. ఎందుకు తనకి ఈ విధంగా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో అసలు ఈ విషయం తెలియడంతో లాస్య ఆనంద పడుతూ ఉండగా నన్ను మాత్రం తులసి ఇంటి పై పడి తన మాటలతో తులసిని బాధ పెడతాడు.
Read Also : Intinti Gruhalakshmi : అభికి బుద్ది చెప్పిన ప్రేమ్.. సంతోషంలో తులసి కుంటుంబం..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World