Karthika Deepam june 24 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య, హిమ ఇద్దరు సౌర్య గురించి తలచుకొని బాధ పడుతూ వుంటారు.
ఈ రోజు ఎపిసోడ్ లో హిమ మాట్లాడుతు ఒకరోజు ఐస్ క్రీమ్ పార్లర్ సౌర్య బావ ను ప్రేమిస్తున్న విషయం తెలిసింది. నిరుపమ్ బావ పేరుని సౌర్య నా మొగుడు అనే సేవ్ చేసుకుంది అప్పటినుంచి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనడంతో సౌందర్య బాధపడుతుంది. అంతేకాకుండా అమ్మ నాన్న నాకు చనిపోయే ముందుగా సౌర్య జాగ్రత్త హిమ అని చెప్పారు నానమ్మ అంటూ ఎమోషనల్ అవుతుంది హిమ.
జ్వాలా దగ్గర నేను హిమ అన్న విషయం తెలియకుండా, నీ చేతి పై ఉన్న పచ్చబొట్టు కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడ్డాను అని చెబుతుంది. నా మీద జ్వాలా కి పీకల వరకు కోపం ఉంది అంటూ సౌర్య గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది హిమ. హిమ మాటలు విని సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. మరొకవైపు నిరుపమ్, జ్వాలాకి తన మనసులో మాట చెప్పినందుకు సంతోషంగా ఆనంద పడుతూ ఉంటాడు.
ఇప్పుడు హిమను పెళ్లి చేసుకుని ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా చూసుకుంటాను అని అంటాడు. మరొకవైపు జ్వాలా జరిగిన విషయాన్ని పదే పదే తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో సౌందర్య అక్కడికి రావడంతో సౌందర్యని చూసి ఆశ్చర్యపోతుంది జ్వాల. అప్పుడు సౌందర్య నిన్ను అనాధ ఆశ్రమం లో చూశాను అని అనగా అక్కడ నీకేం పని అని అనడంతో ఆ అనాధ ఆశ్రమం నీ నడిపిస్తున్నాను అని చెబుతుంది సౌందర్య.
నీకు అతనికి మధ్య గొడవ ఏంటి అని అనగా నిరుపమ్ విషయంలో తాను కన్న కలల గురించి తలచుకుని ఎమోషనల్ అవుతుంది జ్వాలా. అన్ని కరెక్ట్ గా ఉంటే నేను డాక్టర్ పెళ్ళాన్ని అయ్యేదాన్ని అనడంతో సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. జ్వాల మనసులో బోలెడంత బాధను పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతూ సినిమాకి వెళ్దామా అని అంటుంది.
నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు దెబ్బ తగిలితే ఏడ్చుకుంటూ కూర్చునే రకం కాదు అని చెప్పింది నిరుపమ్ కోసం తాను రక్తంతో గీసిన బొమ్మను చూపించడంతో సౌందర్య ఎమోషనల్ అయి జ్వలా హత్తుకుంటుంది. మరొకవైపు శోభ, స్వప్న ఇంటికి వచ్చి తనకు,నిరుపమ్ కి పెళ్లి చేయమని అడుగుతుంది. ఆ తరువాత సౌందర్య, జ్వాలా ఇంట్లో వంట చేస్తూ ఉండగా అది చూసి జ్వాలా ఆశ్చర్యపోతుంది.
రేపటి ఎపిసోడ్ లో శోభ కావాలనే జ్వాలా కి ఫోన్ చేసి తానే హిమ అని చెప్పి ఒక ప్లేస్ రమ్మని చెబుతుంది. తీరా అక్కడికి వెళ్లి చూశాక అసలైన హిమ ఉండటంతో అసలు నీ పేరు ఏంటో చెప్పు ఉంటూ హిమను నిలదీస్తుంది జ్వాలా.
Tufan9 Telugu News And Updates Breaking News All over World