Karthika Deepam june 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్ తన మాటలతో జ్వాలా మనసు ముక్కలు చేస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఎమోషనల్ అవుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపొండి మీరు అబద్దం, మీ తింగరి అబద్దం, మీ మాటలు అబద్ధం అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు నిరుపమ్ అక్కడినుంచి వెళ్లిపోగా జ్వాలా, ఎమోషనల్ అవుతుండడంతో అది చూసి తట్టుకోలేక సౌందర్య పద హిమ,సౌర్య దగ్గరికి వెళ్దాం అని అనగా అప్పుడు హిమ నానమ్మ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అని అనడంతో అక్కడి నుంచి సౌందర్య వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత రోడ్డుపై హిమ నడుచుకుంటూ జరిగిన విషయాన్ని తలచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఆలోచిస్తూ వెళ్తుండగా ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టబోతుండగా అప్పుడు సమయానికి ప్రేమ్ వచ్చి, హిమ ను కాపాడి కొద్ది సేపు తనతో మాట్లాడి అక్కడి నుంచి హిమ తీసుకొని వెళ్తాడు.
మరొకవైపు జ్వాల జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా తింగరి చేసింది అని హిమ పై కోపంతో రగిలి పోతూ ఉంటుంది. నిరుపమ్ అన్న మాటలను తలుచుకొని పదేపదే బాధపడుతూ ఉంటుంది జ్వాలా.
హిమను తన వెంటబెట్టుకొని తిప్పి తనకు ధైర్యం నూరిపోసినందుకు తనకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ ఉండగా ఇంతలోనే హిమ రెండు మూడు సార్లు ఫోన్ చేయడంతో జ్వాలా ఫోన్ కట్ చేస్తుంది. అయినా కూడా హిమ అలాగే ఫోన్ చేయడంతో జ్వాలా ఆ ఫోన్ కాల్ ని లిఫ్ట్ చేసి హిమ పై విరుచుకుపడుతుంది.
హిమ కు మాట్లాడే అవకాశం లేకుండా చెడామడా తిట్టి వేస్తుంది. అంతేకాకుండా ఇప్పటి నుంచి నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు అని అనడంతో హిమ ఎమోషనల్ అవుతుంది. ఆ తరువాత జ్వాలా అన్న మాటలు తలుచుకొని హిమ ఎమోషనల్ అవుతూ సౌర్య ఫోటోని చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య వచ్చి హిమ ను ఓదారుస్తుంది.
హిమ మాటలకు సౌందర్య కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు సౌందర్య,సౌర్య, హిమ చిన్నప్పటి విషయాల గురించి తలుచుకొని బాధ పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్ జరిగిన విషయాన్ని తలచుకునే సారీ జ్వాలా నీతో అలా ప్రవర్తించినందుకు అని అనుకుంటూ ఉంటాడు.
మరొకవైపు జ్వాలా కూడా జరిగిన విషయం తెలుసుకుని బాధ పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య వచ్చి అతనికి నీకు గొడవ ఎందుకు జరిగింది అని అనగా అప్పుడు జ్వాలా అన్ని బాగుంటే నేను డాక్టర్లు పెళ్ళాన్ని అయ్యేదాన్ని అని జ్వాలా ఎమోషనల్ అవడంతో సౌందర్య కూడా ఎమోషనల్ అవుతూ జ్వాలాని హత్తుకుంటుంది.
Read Also : Karthika Deepam june 22 Today Episode : జ్వాలా మనసు ముక్కలు చేసిన నిరుపమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?