Viral video : చాలా మంది డ్యాన్సర్లకు మాంచి బీట్ వస్తే చాలు అస్సలే ఆగలేరు. అందులోనూ తమ అభిమాన హీరో పాట వస్తే ఎక్కుడున్నామన్నది కూడా మర్చిపోయి కాలు కదిపేస్తుంటారు. అందులోనూ మాస్ సాంగ్ అయితే అదిరిపోయేలా స్టెప్పులు వేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఓ ముసలావిడ కూడా అలాగే తనికిష్టమైన పాట వచ్చి ఆగలేక డ్యాన్స్ వేసింది. నడిరోడ్డు అని కూడా చూడకుండా ఫుల్ జోష్ తో స్టెప్పులు వేసేసింది. చెప్పాలంటే యువతీ యువకుల కంటే కూడా ఎక్కువ ఊపుతో చేసింది.
సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా ఈ ముసలావిడ వీడియో కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోని చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. కుర్రోళ్లు అయితే ఎం తిప్పుతున్నావ్ అమ్మా అంటూ స్పందిస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా ఇంత జోష్ తో డ్యాన్స్ వేయడం మామూలు విషయం కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓసారి ఈ వీడియో చూడండే. మీకే తెలుస్తుంది ఈ ముసలావిడ డ్యాన్స్.