Karthika Deepam june 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, సౌర్య ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్ భోజనం చేస్తూ జ్వాలా అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అనవసరంగా హిమ జ్వాలా కు లేనిపోని ఆశలు అన్నీ కల్పించి డిస్ట్రబ్ చేస్తోంది. అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సత్య, ఏమయింది నిరుపమ్ ఎందుకు తినకుండా ఆలోచిస్తున్నావు అని అనడంతో ఏమి లేదు అని చెప్పి భోజనం చేస్తూ ఉంటాడు.
ఆ తర్వాత జ్వాలా, ఆనంద్ దగ్గరికి వెళుతుంది. ఆనంద్ పై ఎందుకు కోపం చూపిస్తున్నాను. మోనిత కొడుకుగా పుట్టడమే తప్పా అనుకుంటూ ఆనంద్ కీ ఖర్చులకు డబ్బులు ఇస్తుంది. ఆ తరువాత హిమ,జ్వాలా కీ ఫోన్ చేసి సీరియస్ గా మాట్లాడుతుంది.
అనాధ ఆశ్రమం కి రమ్మని చెబుతుంది. ఇక నిరుపమ్ కారులో వెళ్తూ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హిమ ఇలా అయితే నా మాట వినదు అని బలవంతంగా గుడి కి తీసుకెళ్ళి తాళిబొట్టు కట్టేస్తా పని అయిపోతుంది అని ఆలోచించి హిమ ను గుడి దగ్గరికి తీసుకుని వెళ్లి తాళిబొట్టు కడతాడు.
హిమ వద్దు అని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా తాళిబొట్టు కట్టినా నువ్వే నా భార్య అని అంటాడు. అయితే ఇదంతా కూడా శోభ కలగంటుంది. అప్పుడు శోభ తనలో తానే మాట్లాడుకుంటూ పొరపాటున ఈ కల నిజమైతే నా పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటుంది.
హిమను తప్పించి ఎలా అయిన నిరుపమ్ ను సొంతం చేసుకోవాలి అని శోభ ఆలోచిస్తుంది. మరొకవైపు సౌర్య ఆలోచిస్తూ, హిమ నాతో గేమ్స్ ఆడుతోందా. ఈ విషయం నాన్నకు తెలిసి కూడా ఇలా చేస్తోందా అంటూ తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది.
మరోవైపు స్వప్న నిరుపమ్ గురించి ఆలోచిస్తుండగా ఏం చెయ్యాలి హిమనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని అనుకుంటే నేరుగా వారి ఇద్దరిని పిలిచి అదే విషయం చెప్తాడు.
హిమను పెళ్లి చేసుకోబోతున్న అంటూ షాక్ ఇస్తాడు. మా పెళ్లి గ్రాండ్ గా పద్దతిగా జరగాలి అనుకుంటాడు. మరీ రేపటి భాగంలో హిమ,నిరుపమ్ పెళ్లి పనులు మొదలవుతాయి. వారిద్దరూ కలిసి పసుపుకొమ్ములు దంచుతూ ఉండగా అది చూసిన జ్వాలా ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam june 15 Today Episode : శోభకు అడ్డంగా దొరికిపోయిన హిమ.. బాధలో నిరుపమ్..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World