Karthika Deepam Monitha: బుల్లితెరపై ప్రసారం అవుతూ అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి.ఈ సీరియల్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించే దీప, కార్తీక్, మోనిత పాత్రలకు విపరీతమైన క్రేజ్ ఉండేది.ఈ ముగ్గురు సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ కైవసం చేసుకొని దూసుకు పోయింది. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి ఈ ముగ్గురు పాత్రలను తొలగించారు.
ఈ విధంగా కార్తీక్, దీప, మోనిత పాత్రలు లేకపోవడంతో ఈ సీరియల్ రేటింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ముగ్గురు లేని సీరియల్ మేము చూడమంటూ అభిమానులు కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ ముగ్గురు తిరిగి ఈ సీరియల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే డాక్టర్ బాబు ఈ విషయంపై స్పందిస్తూ రీ ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఇకపోతే ఈ సీరియల్ లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కార్తీక దీపం సెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కార్తీకదీపం సీరియల్ షూటింగ్ లొకేషన్ లో కి వెళ్లిన ఈమె అక్కడ ఆర్టిస్టులతో పెద్ద ఎత్తున సందడి చేశారు. అందరితో కలిసి ఎంతో సరదాగా మాట్లాడి పలు సూచనలు చేసిన మోనిత వెళ్లి మానస్ ను పలకరించగా ఆమెను ఒకేసారి మానస్ అత్తయ్య అని పిలవడంతో షాక్ అయ్యారు. ఇలా అత్తయ్య అని పిలుస్తారనే నేను ఈ సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వలేదని తెలిపారు. ఇకపోతే అందరితో కలిసి సరదాగా మాట్లాడిన ఈమె నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు ఉండటంతో అతనితో కలిసి భోజనం చేసింది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World