Naga chaithanya: సనంత, నాగ చైతన్య విడిపోయి 100 నెలలు కావొస్తున్నా వీరి విడాకులపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఇక లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చై ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇందులో సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్ పై కూడా చె ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే భవిష్యత్తులో నటించే అవకాశం ఉందా అని అడగ్గా… ఇలా జరిగితే క్రేజీగా ఉందని చై బుదులిచ్చారు. సమంత గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా సమంత మీకు ఎదురుపడితే ఏం చేస్తారని అడగ్గా… హాయ్ చెప్పి హగ్ ఇస్తానంటూ ఆన్సర్ చేశాడు. దీంతో చై చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. గతంలో ఇదే ప్రశ్న సమంతకు ఎదురైందన్న విషయం కూడా మనకు తెలిసిందే.
అందుకు సమంత సమాధానం ఇస్తూ.. మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన వస్తువులేవీ లేకుండా చూస్కోవాలని అంటూ సామ్ పేర్కొన్ని విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ చై మాత్రం హాయ్ చెప్పడమే కాకుండా హగ్ ఇస్తానంటూ ఆన్సర్ ఇవ్వడంతో వీరిద్దరి ఆలోచనలకు ఎంత తేడా ఉందంటూ నెటిజెన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే తెగ సంబర పడిపోతున్నారు. అదీ మా హీరో అంటే అలా ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.