Naga Chaithanya : నాగ చైతన్య తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎన్నో విషయాల మీద స్పందించాడు. జాతీయ మీడియా ఎక్కువగా నాగ చైతన్య పర్సనల్ విషయాలు మీదే శ్రద్ధ పెట్టినట్టుంది. ఇక ఇందులో భాగంగా నాగ చైతన్య ఓ నాటీ పని గురించి స్పందించాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కారులో తన ఫ్రెండ్ తో ముద్దుల్లో తేలి పోతుండగా… అడ్డంగా బుక్కైనట్లు చెప్పుకొచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటో ఓసారి చూద్దాం.
ఇటీవలే చై ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఉన్న హోస్ట్.. రైల్వే స్టేషన్ లోతన గర్ఫ్ ఫ్రెండ్ ను ముద్దు పెట్టుకుంటుండగా పోలీసులకు దొరికిపోయినట్లు తెలిపాడు. దీనికి కొనసాగింపుగా నాగ చైతన్య కూడా తనకు జరిగిన ఓ స్వీట్ మెమోరినీ బయట పెట్టేశాడు. కారులో ప్రయాణించేటప్పుడు తనకు కూడా ఇలాంటి ఘటన జరిగిందని వివరంచాడు. నేను కారులో ఉండగా ముద్దులు పెడుతుంటే దొరికిపోయానని.. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదని పేర్కొన్నారు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.