Women Marry Multiple Husbands : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. అలాగే ఆయా దేశాల్లో జీవనశైలితో పాటు వాతావరణ పరిస్థితులు, అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. అయితే చాలా దేశాల్లో వివాహాల విషయాల్లో అనేక చట్టాలు ఉన్నాయి. చాలావరకూ కొన్ని దేశాల్లో ఏకస్వామ్య, బహుభార్యాత్వ వివాహాలను మాత్రమే అనుమతిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్కృతుల్లో ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేందుకు అనుమతిస్తాయి. కొన్ని దేశాల్లో ఒక మహిళ.. ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది.
పురుషులు ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటమనేది అసాధారణమేమి కాదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక సాంస్కృతిక పద్ధతులు ఇలాంటి వివాహాలకు మద్దతు ఇస్తున్నాయి. అయితే బహుళ భర్తలను కలిగిన మహిళల గురించి వినడం అసాధారణంగా చెప్పవచ్చు. అంటే.. ఒక స్త్రీకి ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తలు ఉంటారు. ప్రపంచంలో ఏయే దేశాల్లో మహిళలకు ఎక్కువ మంది భర్తలు ఉంటారో తెలుసా? అందులో బాగా ప్రసిద్ధి చెందిన ఐదు దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అందులో మన భారతదేశం కూడా ఉందంటే అతిశయోక్తి కాదు.. ఇంతకీ మనదేశంలో ఎక్కడ.. ఏయే ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. భారత్ (India) :
ఉత్తర భారతదేశంలోని జౌన్‌సర్బవార్ ప్రాంతం.. అక్కడి పహారీలు పాలీయాండ్రీ ఆచారాలను పాటిస్తున్నారు. హిమాచల్‌లోని కిన్నౌర్‌లో మైనారిటీ ప్రజలు ఈ తరహా విధానాన్ని ఎప్పటినుంచో ఆచరిస్తున్నారు. పాచి పాండవుల వారసులుగా (పాంచాల రాజు కుమార్తె ద్రౌపదికి భర్తలైన ఐదుగురు సోదరులు) వారు సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. నీలగిరిలోని తోడా తెగ, ట్రావెన్‌కోర్‌కు చెందిన నజానాద్ వెల్లాల, దక్షిణ భారత్‌లోని కొన్ని నాయర్ కుల వ్యవస్థలతో కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. 1988లో, టిబెట్ యూనివర్శిటీ 753 టిబెటన్ కుటుంబాలపై ఒక సర్వే నిర్వహించింది. అందులో 13శాతం మంది బహుభార్యాత్వాన్ని కొనసాగిస్తున్నారని కనుగొన్నారు.
2. కెన్యా (Kenya) :
కెన్యాలో పాలియాండ్రీ చట్టాన్ని పూర్తిగా నిషేధించలేదని అంటారు. పాలియాండ్రీ చట్టం అనేది ఒక సాధారణ పద్ధతి. పాలీయాండ్రీ వివాహం మొదటిసారిగా కెన్యాలో 2013లో ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆ వధువు తనకు ఏ వ్యక్తి భర్తగా కావాలో నిర్ణయించుకోలేక పోయింది. అందుకే ముగ్గురినీ పెళ్లి చేసుకోవాలనే విధానం అమల్లోకి వచ్చింది. కెన్యాలోని మసాయ్ ప్రజలలో బహుభార్యాత్వం గురించి కూడా నివేదికలు ఉన్నాయి. ఆగస్ట్ 2013లో, ఇద్దరు కెన్యా పురుషులు తమతో సంబంధం కలిగి ఉన్న మహిళను వివాహం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.
3. చైనా (China) :
చైనాలో టిబెట్ (టిబెటన్ పీఠభూమి)లో ఎక్కువ భాగం విస్తరించిన ప్రాంతంగా చెబుతారు. టిబెటన్ ప్రజల సాంప్రదాయ మాతృభూమిగా పేరొందింది. మోన్పా, తమాంగ్, కియాంగ్, షెర్పా, లోబా ప్రజల వంటి కొన్ని ఇతర జాతులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు అధిక సంఖ్యలో హాన్ చైనీస్ హుయ్ ప్రజలు కూడా నివసిస్తున్నారు. గతంలో టిబెట్ ప్రజలు సోదర బహుభార్యాత్వాన్ని పాటించేవారు. తమ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను పెళ్లిచేసుకునేవారట.. అయితే వారిలో ఏ బిడ్డ ఎవరికి చెందినదో భర్తకు చెప్పకపోవచ్చు. అయినప్పటికీ, టిబెట్ అటానమస్ రీజియన్ ప్రభుత్వం 1981లో కుటుంబ చట్టం ప్రకారం.. కొత్త బహుభార్యాత్వ వివాహాలను నిలిపివేసింది.
Women Marry Multiple Husbands : చాలా దేశాల్లో ఇలాంటి ఆచారా వివాహాలు చట్టవిరుద్ధం..
ఇప్పుడు టిబెట్‌లో అలాంటి ఆచారాలు పాటించడం చట్టవిరుద్ధం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ కొనసాగుతోందని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం, పాలీయాండ్రీ అన్ని టిబెటన్ ప్రాంతాలలో ఒకటిగా ఉంది. కానీ, త్సాంగ్, ఖామ్‌లోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో జీవనపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. Xigaze, Qamdo ప్రిఫెక్చర్‌లలోని అనేక గ్రామాలపై 2008లో జరిపిన అధ్యయనంలో 20-50శాతం కుటుంబాలు పాలియాండ్రిక్‌గా ఉన్నాయని తెలిసింది. వీరిలో ఎక్కువ మందికి ఇద్దరు భర్తలు ఉన్నారని కనుగొన్నారు. కాలాక్రమేణా ఈ సంఖ్య 90శాతం వరకు పెరిగింది. అదే నగర వాసులు లేదా ఇతర వ్యవసాయేతర గృహాలలో పాలియాండ్రీ ఆచారం అనేది చాలా అరుదుగా కనిపిస్తోంది.
4. నేపాల్ (Nepal) :
నేపాల్ దక్షిణాసియా దేశంగా పేరొంది. ప్రధానంగా హిమాలయాల్లో ఎక్కువగా విస్తరించి ఉంది. ఇండో-గంగా మైదానంలోని కొన్ని భాగాలతో కలిసి ఉంది. 1963 నుంచి నేపాల్‌లో అధికారికంగా బహుభార్యత్వం నిషేధించారు. అయితే హుమ్లా, డోల్పా, కోసి ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం చట్టం కన్నా తమ సంప్రదాయాలకే చాలా ఎక్కువ విలువనిస్తారు. ఇక్కడ బహుజన కుటుంబాలకు చెందిన మొత్తం గ్రామాలు ఉన్నాయి. నేపాల్ ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో భోటే, షెర్పా, న్యూబీ వంటి గిరిజనులలో కూడా ఈ రకమైన వివాహం చేసుకోవడం చాలా సాధారణంగా కనిపిస్తుంది.
5. గాబన్ (Gabon) :
గాబోనీస్ అనే చట్టం ప్రకారం.. బహుభార్యాత్వ వివాహంలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఆచరిస్తుంటారు. ఇక్కడి దేశంలో బహుళ జీవిత భాగస్వాముల హక్కు పురుషులకు మాత్రమే అనుమతి ఉంది. మే 2021లో ఒక గాబోనీస్ మహిళ తనకు ఏడుగురు భర్తలను ఉన్నారని తెలిపింది. అయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఆ ఏడుగురు భర్తలతో ఎలా జీవించాలో కూడా ఆమె వివరించడం సర్వే చేసేందుకు వెళ్లినవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత ఆధునిక జీవితంలో ఇలాంటి ఆచారాలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఇంకా.. ఇలాంటి విషయాలు వెలుగులోకి రానవి చాలానే ఉన్నాయి.