Toddler Revenge : పాముపై రెండేళ్ల చిన్నారి ప్రతీకారం తీర్చుకుంది. నన్నే కాటేస్తావంటూ ఆ చిన్నారి కోపంతో ఆ పామును తన చేతులతో పట్టుకుని గట్టిగా పళ్లతో కొరికి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన టర్కీలో జరిగింది. బింగోర్ సిటీలో రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటోంది. పాప దగ్గరకు 20 అంగుళాల (50 సెంటీమీటర్లు) పొడవైన పాము వచ్చింది. ఆడుకుంటున్న చిన్నారి పెదవిపై కరిచింది. పాము కాటేయడంతో చిన్నారి నొప్పితో అల్లాడిపోయింది.
ఆ కోపంలో నన్నే కాటేస్తావా అంటూ ఆ పామును చేతిలో గట్టిగా ఒడిసిపట్టేసుకుంది. తన నోట్లో పామును పెట్టి కసితీరా పళ్లతో కొరికి కొరికి చంపేసింది. పామును చంపిన తర్వాత చిన్నారి గట్టిగా ఏడ్చేసింది. పాప ఏడుపు విన్న తల్లిదండ్రులు వెంటనే వచ్చారు. బాలిక నోటి నుంచి రక్తం రావడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.
పాప పెదవిపై పాము కాటు గాయం కనిపించింది. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. పాము కాటువేసినట్లు నిర్ధారించారు. చిన్నారిని 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.
పాము కాటుతో అతని చేతి ‘సాధారణ సైజు కంటే ఐదు రెట్లు’ వాచడంతో ఆస్పత్రికి తరలించారు. జేక్ క్లోసియర్ బీచ్‌కు పర్యటనలో ఉన్నప్పుడు విషపూరిత పాము కాటేసింది. అతను నార్ఫోక్‌లోని ప్రముఖ బ్యూటీ స్పాట్ హెమ్స్‌బీ బీచ్‌లో తండ్రి కెన్నీ, 33, తల్లి సోఫీ, 32, ఇసుక తిన్నెలలో ఆడుకుంటుండగా పాము చిన్నారిని కాటేసింది. మొదట కాటు హానిచేయని గడ్డి పాము నుంచి భావించారు.
Read Also : Viral video: బిడ్డ జోలికి వస్తే తల్లి ఊరుకుంటుందా.. తొక్కి పట్టి నార తీస్తుంది!