Devatha june 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి, రాధ విషయంలో ప్రేమగా ప్రవర్తించమని మాధవని ఇంక రెచ్చగొడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో సత్య పూజారిని ఇంటికి పిలిపించడం తో దేవుడమ్మ ఎందుకు అని అడగగా మీరు ఉపవాసం చేస్తున్నారు కదా ఆంటీ అందుకు బదులుగా వేరే మార్గం ఏదైనా ఉందేమో అని పిలిచాను అని అనగా వెంటనే దేవుడమ్మ తన ఆరోగ్యానికి ఏమి కాదు అని అంటుంది. అప్పుడు పూజారి మరొక మార్గం కూడా ఉంది పిండివంటలను, చీరలను మీ కోడలి వయస్సు ఉన్నవారికి వాయనంగా ఇస్తే మంచి జరుగుతుంది అని అనడంతో దేవుడమ్మ కుటుంబం అందరూ సంతోష పడతారు.

మరొక వైపు రాధ వంటగదిలో పని చేస్తూ ఉండగా మాధవ అక్కడికి వెళ్లి మీరు ఇవ్వమని అడగగా అక్కడ హాల్ లో ఉన్నాయి తాగమని చెబుతుంది. అప్పుడు మాధవ, రాధతో ఏదో ఒకటి మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ వుండగా ఇంతలోనే ఆదిత్య ఫోన్ చేయడంతో మాధవ కోపంతో రగిలి పోతూ ఉంటాడు. అప్పుడు రాధ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తన చెవిలో పెట్టమని అనడంతో మాధవ రాధ చెప్పిన విధంగా చేసి కోపంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
అప్పుడు ఆదిత్య ఫోన్ చేసి తన తల్లి దేవుడమ్మ ఉపవాసం మానేసింది అని అందుకోసం సత్య ఒక మంచి ప్లాన్ చేసింది అని తెలియని విషయం మొత్తం వివరించడంతో రాధా సంతోషపడుతుంది. ఇప్పుడు మేము అందరూ గుడి బయలుదేరుతున్నాము అని ఆదిత్య అనడంతో రాధ కూడా దేవుడమ్మ ను చూడటం కోసం గుడికి వెళుతుంది.
ఒక గుడిలో దేవుడమ్మ కుటుంబాన్ని చూసిన రాధ సంతోష పడుతూ ఉంటుంది. తనకోసం తన అత్తమ్మ చేస్తున్న పూజలు, పనులు చూసి రాధ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు దేవుడమ్మ కుటుంబం పూజ అయిపోయిన తర్వాత అందరికీ వాయనాలు ఇస్తూ ఉంటారు. ఇక చివరిగా ఒక వాయనం మిగిలి పోవడంతో దానిని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా దూరంలోని రుక్మిణి కనిపించడంతో అక్కడికి వెళుతుంది.
తీర రాధకు వాయనం ఇవ్వబోతుండగా కమలకు కళ్ళు తిరగడంతో వెంటనే దేవుడమ్మ అక్కడి నుంచి వెళ్లిపోగా అది చూసిన రాధ అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది. మిగిలిన ఆ ఒక్క వాయనం ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి అని దేవుడమ్మ అనుకుంటూ ఉండగా అప్పుడు గుడిలో పూజారి అమ్మవారికి ఆ వాయనం చేతిలో పెడతాను.
ఆమె ఎవరికి దక్కుతుందో వాళ్ళకే చేరవేస్తుంది అని అనడంతో పూజారి చెప్పిన విధంగా చేసి దేవుడమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. రాధా కూడా అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇంతలో పూజారి రాధ ని పిలిపించి వెంటనే అమ్మవారి దగ్గర ఉన్న వాయనం ఇవ్వడం తో రాధ సంతోష పడుతూ ఉంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య వచ్చి మీ అందరికీ గుడ్ న్యూస్ నాకు పిల్లలు పుడతారు అని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అమెరికాలో ఆ ప్రాబ్లం కి సంబంధించిన ట్రీట్మెంట్ వుంది అది క్లియర్ అవుతే నాకు పిల్లలు పుడతారు అని అనడంతో దేవుడమ్మ ఆదిత్య సత్యలను వెంటనే అమెరికాకు బయలుదేరమని చెబుతుంది..
Read Also : Devatha june 24 today episode : జానకిపై మండిపడ్డ రాధ.. మాధవ ను మరింత రెచ్చగొడుతున్న జానకి..?