Devatha june 24 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, రాధ దగ్గరికి వెళ్ళి ఇక నావల్ల కాదు మన ఇంటికి వెళ్లి పోదాం పద అని రాధతో అంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి ఇద్దరు స్కూల్ కి వెళ్తూ ఉండగా. దేవి తన ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పార్టీ ఇవ్వాలి అని ఐదు వందల రూపాయలు తీసుకుని వెళుతూ ఉండగా దారి మధ్యలో గాలి రావడంతో దేవి చేతిలో ఉన్న ఆ 500 రూపాయలు ఒక తాగుబోతు వ్యక్తికి చిక్కుతుంది. అప్పుడు ఆ తాగుబోతు వ్యక్తి ఆ 500 రూపాయలు తనదే అంటూ దేవి తో గొడవ చేశాడు.
దేవి ఇవ్వమంటే ఇవ్వకుండా ఉండడంతో అప్పుడు దేవి ఆదిత్య మాటలు గుర్తు తెచ్చుకొని మా నాన్న కలెక్టర్. నీ గురించి చెప్పాను అనుకో నిన్ను పోలీస్ స్టేషన్ లో వేస్తాడు అని అనడంతో వెంటనే తాగుబోతు వ్యక్తి భయపడి దేవి డబ్బులు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు భాగ్యమ్మ స్కూల్లో పండ్లు అమ్ముతూ ఉండగా ఇంతలో అక్కడికి కమల భాష వస్తారు.
అప్పుడు కమలా భాగ్యమ్మ పై కోపంతో విరుచుకుపడుతుంది. ఎందుకు ఇక్కడ పండ్లు అవుతున్నావు అని అనగా ఇంట్లో ఒక్కదాన్నే ఉండటంతో పొద్దు పోలేదు బిడ్డ అందుకే ఇలా వచ్చి అనుకుంటున్నాను అని అంటుంది భాగ్యమ్మ. కళ్ళు తాగడం మానేశావు అంట కదా అని అనగా అవును నా చిన్న బిడ్డ కోసం మానేశాను అని అంటూనే పిల్లల కోసం మానేస్తాను అంటూ కవర్ చేసుకుంటుంది.
ఇంతలోనే దేవి అక్కడికి వచ్చి పనులు కొనుక్కొని వెళుతుంది. మరొకవైపు జానకి నా దగ్గరికి వచ్చి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తూ ఉండగా అప్పుడు రాధ నాకు ఇవన్నీ అప్పుడు చెప్పద్దు నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు రాధ జానకి పై కోప్పడుతూ మీరే ఊర్లో అందరికీ నేను మీ కోడలు అని చెప్పుకునే తిరిగారు.
నేను మీ ఇంటికి వచ్చిన మొదట్లో నే వెళ్తాను అని చెప్పాను కానీ మీరు విన లేదు అని రాధా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత సత్య, ఆదిత్య గదిలో చిన్న ఫోన్ బాక్స్ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ ఫోన్ బాక్స్ గురించి ఆదిత్యను అడగగా వాచ్మెన్ కి అని అబద్ధం చెబుతాడు. మరొకవైపు మాధవ తో జానకి మాట్లాడుతుతూ నీ ప్రవర్తన లో మార్పు రావడం వల్లే రాధ ఇంట్లో నుంచి వెళ్లి పోతాను అంటుంది.
ఎలా అయినా మంచిగా మాట్లాడి సొంతం చేసుకోవాలి అని చెబుతుంది జానకి. ఆ తరువాయి భాగంలో దేవుడమ్మ తో పాటు తన కుటుంబం మొత్తం వెళ్తారు. అప్పుడు దేవుడమ్మ అందరికీ వాయనం ఇస్తూ ఉండగా దేవుడమ్మను చూసిన రుక్మిణి భయపడి దాక్కుంటుంది.
Read Also : Devatha june 23 today episode : బాధతో కుమిలిపోతున్న ఆదిత్య.. జానకి పై మండిపడ్డ రాధ..?