Devatha: దేవి మాటలకు ఎమోషనల్ అయిన రాధ.. ఆదిత్య నిలదీసిన సత్య?

Updated on: March 30, 2022

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవి స్కూల్లో తన ఫ్రెండ్ ని దత్తత తీసుకుంటున్నారు అని తెలియగానే అమ్మ ని వదిలి బిడ్డ ఉండగలదా బతకగలదా అని మాట్లాడటంతో ఆ మాటలు విన్న రాద లోలోపల కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు చిన్మయి మన అమ్మ చాలా మంచిది అలా ఎప్పటికీ చేయదు అని అంటుంది. ఆ తర్వాత రాత్రి అందరూ కూర్చుని భోజనం చేస్తుండగా దేవి స్కూల్లో జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంది.

Advertisement

ఇప్పుడు మాట ఏం జరిగింది అని అడగడంతో దేవి జరిగినదంతా వివరిస్తుంది. ఇక అప్పుడు రాద అదే మంచి సమయం అని భావించి దత్తత అంటే అవతల వాళ్ళు కూడా అమ్మానాన్నల మాదిరి ఏది అడిగినా తెచ్చి పెడుతూ పువ్వుల్లో లో పెట్టి చూసుకుంటారు బిడ్డ అని చెబుతుంది.

అన్నీ ఉన్నా అందరు ఉన్నా కూడా అమ్మ ఉండదు కదా అని అంటుంది దేవి. అప్పుడు జానకి మాట్లాడుతూ.. దేవీ చిన్న బిడ్డ అయినా కరెక్ట్ గా చెప్పిందమ్మా.. ఒకటి కడుపున పుట్టి మరొకరి ఒడిలో పెరగాలి అంటే అది ఆ పసి మనసులు తట్టుకుంటాయా అని అంటుంది జానకి. అప్పుడు మాధవ మాట్లాడుతూ అమ్మ లా చూసుకోవడం వేరు అమ్మ చూసుకోవడం వేరు అని అనడంతో రాధ మాట్లాడకుండా మౌనంగా ఉండి పోతుంది.

మరొకవైపు ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ యజమాని కి కాల్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి అని అనడంతో, అప్పుడు అతను చెప్పండి సార్ అని అనగా అప్పుడు ఆదిత్య మీ స్కూల్లో నాకు ఒక అడ్మిషన్ కావాలి అని అంటాడు. అందుకు అతను సరే అనడంతో ఆదిత్య సంతోషంగా ఉంటాడు.

Advertisement

ఇక ఆదిత్య వెనకే ఉన్న సత్య..ఆదిత్య మాట్లాడిన మాటలు అన్నీ విని ఆదిత్య పాప ఎవరు ఆదిత్య అని అనడంతో తెలిసిన వాళ్ళు అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. మరొకవైపు సూరి కరెంట్ రిపేర్ చేస్తూ రాజ్యమ్మను పిలిచి ఊ అన్న తర్వాత స్విచ్ ఆన్ అని చెబుతాడు. ఇంతలో భాష పటేలా పటేలా అంటూ సూరి ని పిలవడంతో, అప్పుడు సూరి ఊ అని అంటాడు.

అప్పుడు రాజమ్మ వెంటనే స్విచ్ ఆన్ చేయడం తో సూరి కరెంటుతో అల్లాడి పోతాడు. ఇంతలో భాష వచ్చి కర్ర తీసుకుని కొట్టడంతో బతికి బయట పడతాడు. మరొకవైపు సత్యదేవుడమ్మతో ఆదిత్య ఫోన్ లో మాట్లాడింది అంత వివరిస్తూ ఆదిత్య ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel