Devatha june 27 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పూజారి అమ్మవారి దగ్గర ఉన్న వాయనం ఈ రాధకు ఇవ్వడంతో సంతోష పడుతూ ఉంటుంది రాధ.
ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ కుటుంబం గుడిలో అనుకున్న విధంగా పూర్తి జరిగినందుకు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ రుక్మిణి లేనందుకు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య రుక్మిణి ఎలా అయినా ఇంటికి వస్తుంది అని అనగా అప్పుడు ఆదిత్య తండ్రి ఎలాగా అని ప్రశ్నించడంతో అప్పుడు దేవుడమ్మ తన నమ్మకమే ఆదిత్య నమ్మకం అని చెబుతుంది.
ఇంతలోనే సత్య అక్కడికి వచ్చి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. నాకు పిల్లలు కలిగే అవకాశం ఉంది ట్రీట్మెంట్ కోసం అమెరికాలి వెళ్లాలి అక్కడ నా ప్రాబ్లం కి సంబంధించిన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తారు అని అనడంతో వెంటనే దేవుడమ్మ సంతోషంతో ఇక ఆలస్యం ఎందుకు బయలుదేరండి అని అంటుంది.
అప్పుడు ఆదిత్య సత్య మాటలకు ఆశ్చర్యపోతూ ఇప్పుడు అమెరికా కి వెళితే దేవికి దూరం అవుతాను అని ఆలోచించి అమెరికాకి వెళ్లడానికి సమయం పడుతుంది అని అనగా వెంటనే సత్య వీటివల్ల తొందరగా పంపిస్తారు అని అనడంతో అప్పుడు దేవుడమ్మ సంతోషంతో హడావిడి చేస్తోంది. అప్పుడు దేవుడమ్మ రుక్మిణి ఒకవైపు బతికే ఉంది మరోవైపు సత్యకు అవకాశం ఉంది అని దేవుడమ్మ సంతోష పడుతూ ఉంటుంది.
మరొకవైపు రాద తనకు వాయనం వచ్చినందుకు చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఎలా అయినా ఆదిత్యకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ రాజ్యమును పిలిపించి సత్య ఆదిత్య లో అమెరికాకు వెళ్లారు వారితో పాటు నువ్వు కూడా వెళ్ళు అని చెబుతుంది.
మరొక వైపు రాధ ఆదిత్య కు ఫోన్ చేసి అత్తయ్య ఇచ్చిన వాయనం నాకు అందింది అని అనడంతో మాధవ షాక్ అవుతాడు. కానీ అత్తయ్య కు నేను కనిపించలేదు అని అనడంతో ఆదిత్య కూల్ అవుతాడు. ఆ తర్వాత సత్యకు పిల్లలు కలిగే అవకాశం ఉందట ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అమెరికా వెళ్తున్నాము అని అనడంతో అప్పుడు రాధ సంతోషపడుతూ పిల్లలు పుడతారు అని తెలిస్తే తప్పకుండా వెళ్ళండి అని సంతోషపడుతుంది.
కానీ ఆదిత్య మాత్రం మిమ్మల్ని ఈ పరిస్థితులలో వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు అని బాధపడుతూ వుండగా రాధ ధైర్యం చెబుతుంది. మరొకవైపు రాధ,ఆదిత్య తో మాట్లాడిన మాటలు విన్న మాధవ ఎలా అయినా రాధ ఇంటి నుంచి గడప దాటక ముందే తన సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు.
మరొకవైపు దేవుడమ్మ రాజ్యమ్మ ఇద్దరు మాట్లాడుతూ ఈ విషయం గురించి తలుచు కొన్ని బాధపడుతూ ఉంటారు. అప్పుడు రాజమ్మ దేవుడమ్మ కు ఏం కాదు అని ధైర్యం చెబుతుంది. మరొకవైపు దేవి, చిన్మయి ఇంట్లో సంతోషంగా ఆడుతూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి దేవి పై కోపంగా అరుస్తాడు.
అప్పుడు హర్ట్ అయిన దేవి లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రాధ మాత్రం మాధవకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మీరు నా బిడ్డ పట్ల చూపించేది దొంగ ప్రేమ. నా బిడ్డకు కావాల్సిన అసలైన ప్రేమ ఆదిత్య దగ్గర దొరుకుతుంది అనడంతో మాధవ కోపంతో రగిలి పోతూ ఉంటాడు.
Read Also : Devatha june 25 Today Episode : రాధ చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న మాధవ..గుడ్ న్యూస్ చెప్పిన సత్య..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World