UI Movie Review : రియల్ స్టార్ కన్నడ యాక్టర్ ఉపేంద్ర కొత్త మూవీ దశాబ్దం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్లో ఉపేంద్ర సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఉపేంద్ర అదే కాన్సెప్ట్‌తో వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత దర్శకుడిగా, హీరోగా ఉపేంద్ర యూఐ మూవీతో వస్తున్నాడు.
ఉపేంద్ర నటించిన యూఐ ఎట్టకేలకు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన విడుతలై పార్ట్ 2, మార్కో, బచ్చల మల్లితో సహా ఇతర మూవీలకు గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఈ చిత్రం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది. మీరు కూడా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ని మీ కుటుంబంతో సినిమాహాళ్లలో చూడాలని ప్లాన్ చేస్తుంటే.. ట్విట్టర్‌లో సినీ ప్రేక్షకులు షేర్ చేసిన రివ్యూలను ఓసారి లుక్కేయండి.
ఉపేంద్ర యూఐ (UI Movie Review) ప్రమోషన్స్ సమయంలోనే భారీ హైప్ ఇచ్చాడు. ఆడియెన్స్ ఇంటిలెజెన్స్ టెస్ట్ చేసేలా ఉంటుందని ముందే చెప్పేశాడు. క్లైమాక్స్ షాట్, ఎండింగ్ షాట్ డీ కోడ్ చేయాలని ఆడియోన్స్ కు ఉపేంద్ర ఛాలెంజ్ కూడా చేశాడు. అయితే, ఈ మూవీ మొదట్లోనే ఒక ట్విస్ట్ పెట్టాడు. ఇంటెలిజెంట్ అయితే.. ఈ సినిమా అసలు చూడకండి.. థియేటర్ నుంచి దొబ్బేయండి అంటూ ముందుగానే క్యాషన్ వేశాడట. ఉపేంద్ర మూవీ కాన్సెప్ట్ ఏంటి? ట్విట్టర్లో యూజర్లు యూఐ గురించి ఎలా చర్చించుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యూ అండ్ ఐ అంటే.. పగలు, రాత్రి అనమాట. కల్కి భగవాన్ వర్సెస్ సత్య (ఉపేంద్ర) పాత్రతో ఈ మూవీ నడుస్తుంది. మూవీ చూసినవాళ్లు ఉపేంద్ర వన్ మెన్ షో అంటున్నారు. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అందరి డైరెక్టర్ల మాదిరిగా కాదు.. ఉపేంద్ర టోటల్ డిఫరెంట్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఉపేంద్ర యూఐ మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటున్నారు. ఉపేంద్రకి ఉన్న నాలెడ్జ్ ఏ డైరెక్టర్‌కి ఉండదని అంటున్నారు.
డైరెక్టర్‌గా ఉపేంద్ర తనెంటో మరోసారి నిరూపించుకున్నాడని ఎక్స్ వేదికగా తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. యూఐ మూవీతో ఉపేంద్ర కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేశాడని అంటున్నారు. అప్పట్లో ఉపేంద్ర టేకింగ్, మేకింగ్‌లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదంటున్నారు. ఆడియెన్స్‌ని కన్ఫ్యూజ్‌లో పెట్టేసి.. అసలేం జరుగబోతుందో గెస్ చేయకుండా మూవీని ముందుకు నడిపిస్తాడు. మూవీలో ఒక్క క్లూ కూడా లేకుండా ఉపేంద్ర తెరకెక్కించాడు. ఆడియెన్స్‌కి సహనానికి పరీక్ష అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
యూఐ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనేది త్వరలో తెలియనుంది. విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, అల్లరి నరేష్ బచ్చలమల్లి మూవీలు కూడా పోటీగా ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కూడా లైనులో ఉంది. ఉపేంద్ర యూఐ సినిమా కూడా రేసులో నిలిచింది. యూఐ మూవీ ఎంతవరకు ఆడియెన్స్ పల్స్ పట్టుకుని నిలుస్తుందో చూడాలి.
Read Also : CAT 2024 Results : క్యాట్ 2024 ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world