...

Rythubandhu: రెండ్రోజుల్లో రైతుబంధు డబ్బులు.. ఆనందంలో అన్నదాతలు!

Rythubandhu: ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రైతులంతా ఎదురు చూస్తున్న కబురును ప్రభుత్వం చెప్పింది. రైతు బంధు కోసం రైతులంతా కళ్లకు కాయలు కాసేలా చూస్తున్నారు. వర్షాలు మొదలయ్యాయి. నాట్లు ప్రారంభమయ్యాయి. రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతు బంధు కోసం అంతా ఎదురుచూస్తుండగా.. రైతులకు రాష్ట్ర సర్కారు రైతు బంధు వేస్తున్నట్లు తీపి కబురు అందించింది. మరో రెండు రోజుల్లో అన్నదాతల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 28వ తేదీన నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Advertisement


ప్రభుత్వం తొమ్మిదో విడత రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులకు రూ. 50,447.33 కోట్లు అందజేసింది సర్కారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 10 వేల చొప్పున అంటే వానాకాలం రూ.5 వేలు, యాసంగికి మరో రూ.5 వేలు ఇస్తోంది సర్కారు. పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.50,447 కోట్లకు పైగా జమ చేశామని చెప్పారు.

Advertisement

రాష్ట్రంలోని పంటల సీజన్ కు ముందే ఏయే పంటలు సాగు చేయాలో సూచించడానికి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను దేశంలోనే మొదటగా తెలంగాణ ఏర్పాటు చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు. వరికి బదులు పత్తి, పప్పు ధాన్యాలు, వేరు శెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి నూనె గింజలు, మినుములు, పెసర సాగు వైపు మళ్లాలని సూచించారు.

Advertisement
Advertisement