Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) అధినేత ఓం ప్రకాష్ చౌతాలా (89) శుక్రవారం (డిసెంబర్ 20) మధ్యాహ్నం తన గురుగ్రామ్ నివాసంలో కన్నుమూశారు. ఐఎన్ఎల్డీ సుప్రీమో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. చౌతాలా హర్యానాకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మాజీ ఉప ప్రధాని దేవిలాల్ కుమారుడు. శనివారం (డిసెంబర్ 21) మధ్యాహ్నం సిర్సా జిల్లాలోని తేజా ఖేరాలో చౌతాలా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన భౌతికకాయాన్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం నివాళులర్పించేందుకు అక్కడే ఉంచుతారు. చౌతాలాకు ఇద్దరు కుమారులు అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఆయన చివరిసారిగా 2005లో రోడి అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. చౌతాలా కుటుంబం హిసార్‌కు చెందినది. హర్యానా రాజకీయాలలో జాట్ కమ్యూనిటీ గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. రాష్ట్రంలో 26 నుండి 28 శాతం జనాభా ఉన్నారు. 36 అసెంబ్లీలలో ఈ కమ్యూనిటీనే ప్రభావం చూపుతుంది.
గతంలో హర్యానా అసెంబ్లీలో అభయ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు అర్జున్ చౌతాలా ప్రస్తుతం హర్యానాలోని రానియా నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. అజయ్ చౌతాలా కుమారుడు దుష్యంత్ చౌతాలా హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బిజెపి -జెజెపి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
Om Prakash Chautala : హర్యానా రాష్ట్రానికి తీరని లోటు : సీఎం నాయబ్ సింగ్ సైనీ
ఓంప్రకాష్ చౌతాలా మృతిపై ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పందించారు. అధికారిక పోస్ట్ ద్వారా ఆయన నివాళులు అర్పించారు. ఆయనకు నా వినయపూర్వకమైన నివాళులు. జీవితాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవలందించారు. దేశ రాజకీయాలకు, హర్యానా రాష్ట్రానికి తీరని లోటు అన్నారు.
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడా కూడా స్పందించారు. ఓం ప్రకాష్ సీఎంగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని అని హుడా అన్నారు. మా మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ప్రజలకు ఎంతో సేవ చేశాడు. ఆయన ఇంకా చురుకుగా పనిచేశారు. ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోతాడని అనిపించలేదు. ఆయన మంచి వ్యక్తి, నాకు అన్నయ్య లాంటివాడు అని పేర్కొన్నారు.
ఓం ప్రకాష్ 1989 నుంచి 1991 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన రాజకీయ ప్రయాణం ముగిసింది. 1999లో ఓంప్రకాష్ చౌతాలా హర్యానాలో బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2005 నాటికి హర్యానా సీఎం అయ్యారు. దేవిలాల్ 2001లో మరణించారు. ఓం ప్రకాశ్ హర్యానాకు నాలుగుసార్లు సీఎంగా ఉన్నారు.
87ఏళ్ల వయస్సులో 10, 12 ఉత్తీర్ణత :
87 ఏళ్ల వయసులో 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. 87 సంవత్సరాల వయస్సులో 10వ, 12వ పరీక్షలలో ఫస్ట్ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. చౌతాలా 2019లో 10వ తరగతి పరీక్ష పెట్టారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఇంగ్లీష్ పేపర్ ఇవ్వలేకపోయారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిజల్ట్స్ రాకపోవడంతో, హర్యానా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ కూడా ఆయన 12వ తరగతి రిజల్ట్స్ నిలిపివేసింది. ఆగస్టు 2021లో 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ పరీక్షను రాశారు. అందులో ఆయన 88శాతం మార్కులు సాధించారు.
Read Also : CAT 2024 Results : క్యాట్ 2024 ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!