Hyper Aadi : జబర్దస్త్ ప్రేక్షకులకు దిమ్మతరిగే న్యూస్.. ఏం జరిగిందో తెలుసా?

Hyper Aadi : బజర్దస్త్ ను వీడిన వారంతా తిరిగి వచ్చేస్తున్నారు. మొన్న గెటప్ శ్రీను అఢుగు పెట్టగా… నేడు హైపర్ ఆది తిరిగి జబర్దస్త్ లో అడుగు పెట్టారు. ముఖ్యంగా హైపర్ ఆది రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్టార్ కమెడిన్ల నిష్క్రమణతో జబర్దస్త్ కళ తప్పింది. కానీ ఒక్కొక్కరుగా వాళ్లు మళ్లీ రావడంతో… జబర్దస్త్ షో ఫ్యాన్స్ అంతా ఆనందంతో ఉబ్బితబ్బిపైపోతున్నారు.

Advertisement

నాగబాబుతో పాటు చాలా మంది కమెడియన్లు జబర్దస్త్ నుంచి వీడినప్పటి నుంచి ఈ పర్వం కొనసాగింది. ఆ క్రమంలోనే రోజా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. దీంతో ఈ లెజండరీ షో టీఆర్పీ సగానికి తగ్గిపోయింది. దీంతో బతిమాలో, బామాలో మళ్లీ పోయిన వాళ్లందరినీ షోలోకి తీసుకు వస్తున్నారు.

Hyper Aadi : నోరు జారిన హైపర్ ఆది.. రోజాను ఎంత మాటన్నాడు.. 

తాజాగా హైపర్ ఆది రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫస్ట్ గెటప్ శ్రీను, తర్వాత హైపర్ ఆది రీఎంట్రీతో ఆయన పూల స్వాగతం పలికారు. వచ్చాడయ్యో సామీ పాటతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. నేను పాలిటిక్స్ లోకి వచ్చానో, జబర్దస్త్ షోకి వచ్చానో అర్థం కావడం లేదంటూ.. రావడం రావడమే పంచ్ వేశాడు ఆది. జడ్జి ఇంద్రజ గారిపై కూడా ఓ పంచ్ వేశారు. మంత్రిగా రోజా గారికి సీటు వస్తే.. జబర్దస్త్ కు జడ్జి సీటు వచ్చిందన్నారు.

Advertisement