Hyper Aadi : ఢీ స్టేజ్ మీద జానీ మాష్టర్ ని అవమానించిన ఆది..!

Updated on: August 4, 2025

Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లో ఆది వేసే పంచులు కామెడీ టైమింగ్ తో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అయితే కొంత కాలంగా ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీంతో జబర్థస్త్ అభిమానులు కొంత నిరాశ చెందారు. కానీ బుల్లితెర మీద ఆది చేసే సందడి మాత్రం ఆగిపోలేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ తన సందడిని కొనసాగిస్తున్నాడు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఆది జానీ మాష్టర్ ని అవమించాడు.

Hyper Aadi
Hyper Aadi

ఈ వారం ప్రసారమవనున్న ఎపిసోడ్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చారు. F3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈయన ఈమధ్య బుల్లితెర మీద పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి ఢీ షో కి వచ్చిన సందర్భంగా జడ్జ్స్ అందరు ఆయన తో కలిసి స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో వారి పర్ఫార్మెన్స్ గురించి అనిల్ రావిపూడి జడ్జిమెంట్ ఇస్తూ.. జానీ నువ్ ఇంకా బాగా చేయాలి. ఫ్యూచర్ లో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేయాలని ఆశిస్తున్న అని జడ్జిమెంట్ ఇస్తాడు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగ నవ్వుతారు.

ఇక ఆది కూడా అక్కడికి వెళ్లి అనిల్ రావిపూడి పక్కన చైర్ లో కూర్చొని జానీ మాష్టర్ ని ఇమిటేట్ చేస్తు..ఆయన పేరేంటి అనిల్ గారు..అని డైరెక్టర్ అనీల్ నీ అడిగి, జానీ చూడమ్మా నువ్వు బాగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు గానీ డాన్సు ఎక్కడమ్మా అని అంటాడు. దీంతో అందరు ఒక్కసారిగ నవ్వుతారు. ఈ క్రమంలో ప్రియమణి గురించి మాట్లాడుతూ.. మీ అందరిలో ప్రియ మాత్రమే చాలా బాగా డాన్సు చేసింది. ప్రియ ఒక్కసారి ఇలా రామ్మ అని అనటంతో ప్రియమణి నవ్వుతూ స్టేజీ మీద నిలబడిపోయింది. ఇలా ఆది జానీ మాష్టర్ కి డాన్స్ చేయటం రాదు అంటూ అందరిముందూ పరువు తీశారు.
Read Also :Hyper Aadi : కోట్లలో ఆఫర్ వచ్చినా హైపర్ ఆది పెళ్లికి ఓకే చెప్పట్లేదు అంటే… కారణం ఇదేనా…?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel