Hyper Aadi: అఖిల్ సార్థక్ పై పంచులు వర్షం కురిపించిన ఆది, ప్రదీప్.. మామూలుగా ఆడుకోలేదుగా?

Updated on: March 12, 2022

Hyper Aadi: బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇతను బిగ్ బాస్ ఓటీటీలోను సందడి చేస్తున్నాడు. సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే ఇతను జన్మించడంతో తనకి కూడా అదే పేరు పెట్టారని పలు సార్లు చెప్పిన అఖిల్ బిగ్ బాస్ ద్వారా తనకి వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ స్థానంలో సందడి చేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమంలో ఎంతో మంది వచ్చినప్పటికీ సుధీర్ రష్మీ లేనిలోటు మాత్రం బాగా కనిపిస్తుందని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత డాన్స్ షోలో పాల్గొన్న అఖిల్ హైపర్ ఆది పంచులకు గురవుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ అఖిల్ పై వరుస పంచులు వేస్తూ అఖిల్ ను ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు.

ఇక ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ…
మేం బాగా ప్రిపేర్ అయి వచ్చాం అని ఆది అనగా, అవసరం లేదు అని ప్రదీప్ అంటాడు వెంటనే అఖిల్ కలుగజేసుకొని ఇది నీ రేంజ్ అంటూ ఆదిని అనడంతో వెంటనే ప్రదీప్ ఆయన మాట్లాడేది నీ గురించి అంటూ తన పై పంచ్ వేసాడు. ఇక ఈ కార్యక్రమం మధ్య మధ్యలో కూడా హైపర్ ఆది ప్రదీప్ కలిసి అఖిల్ ను ఓ రేంజ్లో ఆడుకున్నారని తెలుస్తోంది. ఇక అఖిల్ జానీ మాస్టర్ ను కామెంట్ చేసిన సమయంలో కూడా హైపర్ఆది అఖిల్ పై పంచ్ ల వర్షం కురిపించారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel