Guppedantha Manasu july 13 Today Episode : వసు గురించి ఆలోచిస్తున్న రిషి.. రిషికి తన మనసులో మాట చెప్పడానికి సిద్ధపడిన వసు..?

Gautham questions Rishi about inviting Sakshi to his house in todays guppedantha manasu serial episode
Gautham questions Rishi about inviting Sakshi to his house in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu july 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ వసు, రిషి, సాక్షి ముగ్గురూ కారులో వెళుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి, రిషి తో మాట్లాడుతూ నీకు గుర్తుందా రిషి మన ఎంగేజ్మెంట్ టైంలో నేను చాలా సిగ్గుపడ్డాను నువ్వు కూడా మాట్లాడటానికి చాలా భయపడ్డావు అని కావాలనే ఎంగేజ్మెంట్ టాపిక్ ని తీసుకొని వస్తుంది. అప్పుడు రిషి ఏంటి సాక్షి ఎంగేజ్మెంట్ టాపిక్ ని తీసుకొని వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా వెనక సీట్లో కూర్చున్న వసు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement
Gautham questions Rishi about inviting Sakshi to his house in todays guppedantha manasu serial episode
Gautham questions Rishi about inviting Sakshi to his house in todays guppedantha manasu serial episode

అయితే అప్పుడు సాక్షి కావాలనే వసుని మరింత రెచ్చగొట్టాలి అని రిషితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వెనుక వైపు ఉన్న వసుధార ని అద్దం లో నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు సాక్షి అన్ని బాగుంటే ఈపాటికి మన పెళ్లి అయి ఉండేది అని అనగా వెంటనే వసు కోపంతో ఆపుతారా అని అంటుంది. అప్పుడు రిషి ఏమయ్యింది అని అడగగా మనం ఇల్లు దాటి వచ్చేసాము అని అంటుంది వసు.

Guppedantha Manasu : రిషికి తన మనసులో మాట చెప్పడానికి సిద్ధపడిన వసు…

Advertisement

ఆ తర్వాత ఇంట్లో అందరూ కూర్చొని ఉండగా ఇంతలో రిషి,సాక్షి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలొనే వసు రావడంతో అందరూ సంతోషంగా వసుని పలకరిస్తారు. అప్పుడు దేవయాని, వసు గురించి అడగగా వెంటనే రిషి కాలేజీ పని ఉంది ఇక్కడే ఉంటుంది అనడంతో దేవయాని షాక్ అవ్వగా మిగిలిన వారు ఆనందపడుతూ ఉంటారు.

అప్పుడు రిషి ఆ ప్రాజెక్టు గురించి జగతి, మహేంద్ర లకు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుతో జగతి మాట్లాడుతూ ఉండగా ఇంతలో దేవయానికి సాక్షిని తీసుకొని లోపలికి వెళుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో మహేంద్ర, గౌతమ్ ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు జగతి, వసు సాక్షి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ఈ ప్రాజెక్టు పేరుతో కావాలనే సాక్షి రిషి సార్ కీ దగ్గరే అవుతుంది అని అంటుంది వసు. ఆ తరువాత సాక్షి, దేవయాని ఇద్దరు వసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని ఎలా అయినా ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే లోపు నువ్వు రిషి మనసులో స్థానం సంపాదించాలి అని సాక్షిని రెచ్చగొడుతూ ఉంటుంది దేవయాని. మరొకవైపు గౌతమ్, రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఇంతలో రిషి వచ్చి ఏమైంది ఏమిట్రా నీ ప్రాబ్లం అని అనగా నువ్వే నా ప్రాబ్లం అంటూ రిషి ప్రవర్తన తనకు ఏమీ అర్థం కాలేదు అని మాట్లాడుతాడు గౌతమ్.

అప్పుడు గౌతమ్, వసు, సాక్షి గురించి మాట్లాడుతూ ఈ సాక్షి మా ఇంటికి రావడం నాకు నచ్చలేదు ఈ ప్రాజెక్టులో పని చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని చెబుతాడు. అప్పుడు రిషి,గౌతమ్ ని కన్ఫ్యూజ్ చేసి మాట్లాడతాడు. మరొకవైపు ఇంట్లో అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఇప్పుడు దేవయాని జగతిని అవమానించే విధంగా మాట్లాడడంతో వెంటనే వసుధార దేవయానికీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది.

Advertisement

అప్పుడు అందరు వసు మెచ్చుకుంటూ ఒక మాట చెప్పగా వెంటనే దేవయాని సాక్షి నువ్వు ఏదో ఒక మాట చెప్పు అనడంతో వెంటనే సాక్షి ఉప్పుకప్పురంబు పద్యం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా పళ్ళు నవ్వుతారు. అప్పుడు సాక్షి ఎందుకు అందరూ నవ్వుతారు నాకు తెలిసింది చెప్పాను అని అనడంతో వెంటనే జగతి అంతే కదా ఎవరికి తెలిసింది వారు చెప్తారు అని అంటుంది.

ఆ తర్వాత వసు, రిషి కీ వడ్డించడానికి వెళ్తూ ఉండగా అప్పుడు దేవయాని నువ్వు వెళ్లి వడ్డించు అనడంతో సాక్షి వెళ్లి రిషికి వడ్డించబోతూ ఉండగా అప్పుడు రిషి మీద నీళ్లు పోస్తుంది. అప్పుడు రిషి వెళ్ళి పక్కన కుర్చీలో కూర్చుంటాడు. ఆ తరువాత అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు రిషి భోజనం చేస్తూ వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత అందరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు.

Advertisement

అప్పుడు సాక్షి తనకు తెలిసిన ప్లాన్ ను ఉంది అంటూ ప్రాజెక్టుకు సంబంధించి పోస్టర్లు ఫ్లెక్సీలు కడదాం అని అనగా చెప్పడంతో రిషి సాక్షిని మెచ్చుకోగా వెంటనే వసు మనం చేసే పని లో బాధ్యత కనిపించాలి కానీ హంగులు ఆర్భాటాలు కనిపించకూడదు అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో వసు వర్క్ చేసి అలసిపోయి కాఫీ తాగాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి, వసు కోసం కాఫీ తీసుకుని వస్తాడు. రిషి ని గమనించని వసుధార జగతి కాఫీ తెచ్చింది అని పొగుడుతూ ఉండగా ఇంతలో రిషి ని చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత వసుధార, రిషికి తన మనసులో మాట చెప్పడానికి సిద్ధపడుతుంది.

Advertisement

Read Also : Guppedantha Manasu july 12 Today Episode : రిషి,సాక్షి లపై కోపంతో రగిలిపోతున్న వసు.. బాధపడుతున్న జగతి..?

Advertisement