Guppedantha Manasu july 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి ఇంట్లో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి నాకు కొన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయి అని చెప్పి మనం చేసే చదువుల పండగ అనే కాన్సెప్ట్ గురించి ప్రతి ఒక్క కాలేజీలదగ్గర పోస్టర్ లు వేపిస్తే బాగుంటుంది కదా అని అంటుంది. అప్పుడు రిషి మంచి ఆలోచన అని అనగా వెంటనే వసుధార సార్ మనం చేసే పనిలో బాధ్యత కనిపించాలి కానీ హంగులు ఆర్బాటలు కనిపించకూడదు అని అంటుంది.
అప్పుడు వసు మాటలకు సాక్షి లోలోపల కోపంతో రగిలి పోతూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న వారు అందరు వసు కీ సపోర్ట్ గా మాట్లాడడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత వసు, సాక్షితో వెటకారంగా మాట్లాడుతునంది. ఆ తరువాత సాక్షి, వసు ఇద్దరూ ఒకటే రూమ్ లో కూర్చుని ఉంటారు.
Guppedantha Manasu july 14 Today Episode : దేవయానికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన జగతి..
అప్పుడు సాక్షి, వసు ని తక్కువ చేసి మాట్లాడడంతో వసుధార వెంటనే గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ఆ తరువాత వసు,మోహిని అంటూ దెయ్యం కథ చెప్పడంతో సాక్షి భయపడుతూ ఉంటుంది. అప్పుడు వసు లాప్ టాప్ తీసుకొని బయటకు వెళ్తుంది. మరొక వైపు రిషి వసు ఫోటోని చూసి మురిసిపోతు ఉంటాడు.
అప్పుడు వసు గుర్తుతెచ్చుకొని బాధపడతాడు. మరొకవైపు సాక్షి భయపడుతూ నిద్ర లేవగా ఇంతలోనే అక్కడ వసుని వెనుక వైపు నుంచి చూసి దయ్యమని భయపడుతుంది. ఆ తరువాత వసు, సాక్షిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వసు వర్క్ చేయడం కోసం బయటకు వెళ్తూ ఉండగా వెళ్లొద్దు అని బ్రతిమలాడుతుంది సాక్షి.
మరొకవైపు వసు బయట కూర్చుని వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే రిషి, వసు వర్క్ చేస్తుండగా కాఫీ తీసుకొని రావడానికి వెళ్తాడు. అప్పుడు వసు వర్క్ చేస్తూ కాఫీ తాగితే బాగుండు అనుకుంటూ ఉండగా ఇంతలోనే రిషి కాఫీ తీసుకొని రావడంతో వెంటనే వసుధార, ఏంటి మేడం ఇలా అనుకున్నానో లేదో అప్పుడే కాఫీ తీసుకొని వచ్చారు.
కాఫీ సూపర్ గా ఉంది హంపి పొగుడుతూ ఉండగా ఇంతలోనే అక్కడ రిషి చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు రిషి,వసు దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలి అన్నావ్ కదా అని అడగగా అప్పుడు వసు తన మనసులోని మాటను చెప్పాలి అని అనుకుంటుంది. ఇంతలోనే రిషి, వసుని చూసి దేవయాని వాళ్ళని తిట్టడానికి వెళుతూ ఉండగా ఇంతలో జగతి చేయి పట్టుకుని అడ్డుపడుతుంది.
అప్పుడు వసుధార, రిషి లను కలపడానికి ప్రయత్నిస్తున్నావా అంటూ దేవయాని దారుణంగా మాట్లాడడంతో మర్యాదగా మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇస్తుంది జగతి. అంతేకాకుండా మర్యాదగా మాట్లాడండి చెత్త ఆలోచనలు చేసేది మీరు అంతేకాకుండా లైబ్రరీలో సాక్షి బెదిరించడం వెనక మీరు ఉన్నారు అని రిషికీ చెప్తాను అంటూ బెదిరిస్తుంది జగతి. అప్పుడు దేవయాని జగతి మాటలకు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది .