Devatha june 8 today episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య తన మేనత్త దగ్గరికి వెళ్లి మూడో పెళ్లి విషయం గురించి గట్టిగా నిలదీస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య తన మేనత్త తో మాట్లాడుతూ మేము పిల్లలు లేరని మీ దగ్గరికి వచ్చి బాధ పడ్డామా లేక నిన్ను పెళ్లి చేయమని అడిగామా ప్రతిసారి పెళ్లి పెళ్లి అని ఎందుకు అంటున్నావు అని గట్టిగా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆదిత్య వాళ్ళ మేనత్త ఆమెకు పిల్లలు లేక బాధ పడుతున్నారని అలా అంటున్నాను అని అనగా మేము ఇద్దరం బాధపడటం లేదు మేము సంతోషంగానే ఉన్నాము.
కావాలంటే అమెరికాకు అయినా వెళ్ళి చూపిస్తాను పిల్లలు పుట్టరు అని తెలిస్తే మాకు మేమే పిల్లలుగా జీవితాంతం ఇలానే ఉంటాము అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఒకవేళ సత్య స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారా అని అనగా నాకేంటి బంగారంలాంటి మనవరాలు ఉంది అని అనడంతో వెంటనే ఆదిత్య మా అమ్మ కూడా రేపు నానమ్మ అవుతుంది వచ్చిన పని చూసుకొని వెళితే బాగుంటుంది అని అంటాడు.
ఇక ప్రసాద్, దేవుడమ్మ లను మీ కొడుకు ఎలా అంటున్నాడు చూశారా అనడంతో మాది కూడా అదే మాట అని తనని ఇంట్లో నుంచి పంపిస్తారు. మరొకవైపు దేవి, చిన్మయి జడ వేయించుకోవడానికి నేనంటే నేను అనే పోటీపడగా అప్పుడు రాధా ఇద్దరు కలిసి జడ వేయడం తో పిల్లలు ఇబ్బంది పడతారు. అప్పుడు రాధ ఇద్దరూ పోటీ పడితే ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ జడ వేయడానికి లోపలికి తీసుకొని వెళుతుంది.
మరొకవైపు ఆదిత్య వాళ్ళ అత్త ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ సంతోషపడుతూ అందరి కంటే ఎక్కువ సత్య బాధపడింది అని అంటుంది. అప్పుడు ఆదిత్య వాళ్ళ మేనత్తతో తప్పుగా మాట్లాడాను అని అనగా లేదు నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు అని సర్ది చెబుతారు.
మరొకవైపు పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ
స్కౌంటింగ్ ట్రైనింగ్ లో అక్కడు ట్రైనింగ్ ఇచ్చే మేడం అందరి గోల్స్ అడుగుతుంది. దాంతో దేవి ఆఫీసర్ సర్ లాగా కలెక్టర్ అవుతాను అనటంతో రాధ సంతోషపడుతుంది. మరోవైపు ఆదిత్య రాధ ఫోటో చూసి మాట్లాడుకుంటూ ఉండగా అందులో తన మెడలో తాళిబొట్టు తాను కట్టిందని అనుకుంటాడు. తరువాయి భాగంలో మాధవ రాధతో మాట్లాడుతుండగా రాధ ఆదిత్య నా పెనిమిటి అంటూ మీకు నాకు ఏం సంబంధం ఉంది అనడంతో ఆ మాటలు విని ఆదిత్య షాక్ అవుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 7 today episode : మేనత్త పై విరుచుకుపడిన ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రాధ..?