Devatha june 7 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య జరిగిన విషయాన్ని రాధ కు వివరించడంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో చిన్మయి, దేవీ స్కూల్ నుంచి వచ్చి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు జానకి దంపతులు అని పిలుస్తారు. వారు మళ్లీ భోజనం చేస్తాము మీరు తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అప్పుడు పిల్లలు రాధతో మేము టూర్ కి వెళ్దామని అనగా రాధ వద్దు అని రామ్మూర్తి దంపతులు కూడా వద్దు అని చెప్పడంతో పిల్లలు కాస్త నిరాశ పడతారు.
ఇంతలో మాధవా వచ్చి ఇప్పటినుంచి అవన్నీ ఎందుకు అని అనగా రాధా కోపంతో పిల్లలను మీ పనులు మీరు చూసుకోండి అని గట్టిగా అరిచి అక్కడినుంచి వెళ్లిపోయింది. మరొకవైపు ఆదిత్య ఒంటరిగా కూర్చుని జరిగిన విషయాల గురించి తలచుకొని బాధపడుతూ ఉంటాడు.
ఇంతలోనే సత్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడిగి ఏదైనా ధైర్యంగా అడగాలి మీ అత్తమ్మ ముందు ధైర్యం చేసి అని చెబుతోంది సత్య. మరొక వైపు రాధ పిల్లలకు పనులు చెప్పడానికి బాధపడుతుంది. మరీ ముఖ్యంగా చిన్మయి విషయంలో చాలా బాధపడుతుంది. ఇంట్లో నుంచి నేను దేవి వెళ్లి పోతే అప్పుడు చిన్మయి తన పని తాను చేసుకోవాలీ అని అనుకుంటూ ఉంటుంది రాద.
మరొకవైపు ఈశ్వర్ ప్రసాద్ తన అక్క అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దేవుడమ్మ వచ్చి ఆమె కూడా ఈశ్వర్ వాళ్ళ అక్క అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మాట్లాడిన మాటలకు దేవుడమ్మ కోపంతో రగిలిపోతుంది.
అప్పుడే గట్టిగా నిలదీయాలి అనుకున్నానో కాకపోతే రాకరాక ఇంటికి వచ్చింది ఎందుకు బాధ పెట్టాలి అని ఊరుకున్నాను అని అంటుంది. మా పిల్లల్ని బాధ పెట్టింది నా కొడుకు కోడల్ని బాధపెట్టింది అని బాధపడుతుంది దేవుడమ్మ. మరొక వైపు రాధ దేవి,చిన్మయి లు తమ పని తాము చేసుకుని విధంగా చేస్తూ ఉంటుంది.
ఇక మరోవైపు ఆదిత్య వాళ్ళ మేనత్త ఆదిత్య పెళ్లి సంబంధం గురించి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆదిత్య అక్కడికి వచ్చి ఆమెపై విరుచుకు పడతాడు. నాకు పెళ్లి చేయాలి అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది నాకు ఆల్రెడీ పెళ్లి అయింది సత్య నా పెళ్ళాం అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha june 6 Today Episode : మూడో పెళ్లి గురించి రాధకు చెప్పిన ఆదిత్య.. బాధతో కుమిలిపోతున్న రాధ..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World