Devatha: రాధ మాటలకు షాక్ అయిన మాధవ.. సంతోషంలో ఆదిత్య..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య వాళ్ళ మేనత్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అందరూ సంతోషంగా ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య ఒక చోట నిలబడి రాధ ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. రాధ మాధవ ని పెళ్లి చేసుకుంది అనుకుని ఏమి లాభం లేదు అన్నట్టుగా ఫోటో వైపు చూసి మాట్లాడుతూ ఉండగా అంతలో రాధ మెడలో తాళిబొట్టు ని చూసి షాక్ అవుతాడు. అయితే ఆ తాళిబొట్టుని గతంలో దేవుడమ్మ తనకు కాబోయే కోసం కోడి కోసం చేయించాను అన్న మాటను గుర్తు తెచ్చుకున్న ఆదిత్య, తాను రాధ మెడలో కట్టిన తాళి బొట్టు ఇదే కదా అని అనుకుంటాడు.

Advertisement

Advertisement

ఒకవేళ రాధ మాధవ ని పెళ్లి చేసుకుని ఉంటే మరొక తాళిబొట్టు ఉండేది కదా కానీ నేను కట్టిన తాళి బొట్టు ఉంది అంటే మాధవ ని పెళ్లి చేసుకో లేదేమో అని అనుకుంటాడు ఆదిత్య. అప్పుడు రాధకు తనపై ఉన్న నమ్మకంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. మరొకవైపు స్కూల్ లో ఒక అమ్మాయి చిన్మయి ని గట్టిగా నెట్టడంతో వెంటనే దేవి వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

Advertisement

రాధా ఒంటరిగా ఇంటికి వెళుతూ జరిగిన విషయం తలచుకుంటూ ఉంటుంది. అప్పుడే మాధవ ఎదురుపడి ఎందుకు రాధ ఈ విధంగా చేస్తున్నావు. నువ్వు ఆదిత్య భార్యవి అని ఎందుకు అందరికీ చెబుతున్నావు. ఎవరైనా ఈ మాటలు వింటే నా పరువు పోతుంది అని అంటాడు మాధవ.

Advertisement

అప్పుడు రాధ మాధవ కు గట్టిగా సమాధానం చెబుతుంది. మరొకవైపు ఆదిత్య సంతోషంతో గతంలో రాధ తో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తరువాత మాధవ రాధతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు ఆదిత్యను పెనిమిటి అనడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఆ మాటతో రాధ కోపంతో రగిలిపోతూ అటువంటి ఆలోచనలు నాకు లేవని అంటుంది.

Advertisement

కేవలం మీ అమ్మ నాన్న కోసం, బిడ్డ కోసం వచ్చాను అని అప్పటినుంచి నేను ఇదే మాట చెబుతున్నాను అని గట్టిగా మాట్లాడిన కూడా మాధవ మాత్రం ఊరి జనాలు నిన్ను మా ఇంటి కోడలిగా అనుకుంటున్నారు అని.. ఇప్పుడు ఇలా చేస్తే బాగుండదు అని.. ఊరి జనాల మధ్య పంచాయతీ పెట్టిస్తాను అని అంటాడు. దాంతో రాధ కూడా పంచాయితీ పెట్టించడని అనడంతో మాధవ షాక్ అవుతాడు. ఎప్పటికైనా నా పెనిమిటి ఆదిత్య అంటూ నువ్వు రావాలి అని చూస్తే ఊరుకోను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement
Advertisement