Devatha Aug 5 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ, భాగ్యమ్మ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి దేవి వస్తుంది. దేవి, రాధను పదేపదే నాన్న గురించి చెప్పు అని అంటూ ఉండగా ఇప్పుడు భాగ్యమ్మ నాకు కరాటే నేర్పించు అంటూ దేవి ఆలోచన మార్చే ప్రయత్నం చేసినా కూడా దేవి మళ్ళీ మళ్ళీ రాదని అడుగుతూనే ఉంటుంది. అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది నాయన గురించి మాత్రం చెప్పమంటే చెప్పదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది దేవి. ఇప్పుడు భాగ్యమ్మ, రాధ ఇద్దరు దేవి గురించి బాధపడుతూ ఉంటారు.
మరొకవైపు ఆదిత్య ఆఫీస్ పని చేస్తూ ఉండగా ఇంతలోనే సత్య అక్కడికి వస్తుంది. సత్య వచ్చిన విషయాన్ని కూడా గమనించకుండా ఆదిత్య పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సత్య ఎప్పుడు ఆఫీస్ గురించి బయట వాళ్ల గురించి కాదు ఇంట్లో వాళ్ల గురించి కూడా ఆలోచించాలి అని అంటుంది. అప్పుడు ఆదిత్య ప్రవర్తన గురించి సత్య నిలదీస్తూ ఉంటుంది. సత్య ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆదిత్య ఏం మాట్లాడుకుండా మౌనంగా ఉంటాడు.
దేవత సీరియల్ ఆగస్టు 5 ఈరోజు ఎపిసోడ్ : తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే తపనలో దేవి !
అప్పుడు సత్య ఎమోషనల్ గా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి ఆదిత్య వస్తాడు.
దేవి ఒంటరిగా కూర్చుని తన ఫోటోకీ స్కెచ్ తో మీసాలు గీస్తూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చి ఏంది ఇలా చేస్తున్నావ్ అని అనగా వెంటనే దేవి మా అమ్మని నేను ఎవరి పోలిక అంటే మా నాయన పోలిక అని చెప్పింది సారు అప్పుడు నా ఫోటో కి మీసాలు పెడితే మా నాయన ఎలా ఉంటాడో తెలుస్తుంది కదా అనడంతో ఆదిత్య బాధపడుతూ ఉంటాడు.
దేవి మాటలకు ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు రాధ తెల్లవారినా కూడా ఇంకా పడుకొని ఉంటుంది. ఇంతలోనే చిన్మయి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు చిన్మయి ని చూసి రాధ ఆనంద పడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ తన భర్త తలకు రంగు వేస్తూ ఉంటుంది. అది చూసి సత్య నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సత్య ఆదిత్య,తను ముసలి వాళ్లు అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంది.
మరొకవైపు రాధ వంట చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడు రాధ,భాగ్యమ్మతో చిన్మయి గురించి చెప్పుకొని బాధపడుతుంది. అప్పుడు భాగ్యమ్మ, చిన్మయి అంత ప్రేమ పెంచుకోవద్దు అని చెబుతుంది. మరొకవైపు మాధవ కోసం ఫ్రెండ్స్ వెతుకుతూ ఉంటారు. అయితే మాధవ కాలు విరిగింది అంటూ ఇన్నాళ్లు అబద్ధం చెబుతూ అందరిని నమ్మిస్తూ ఉంటాడు.