Covishield Covaxin Prices : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ టీకాలు పూర్తి కాగా.. ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ డబుల్ డోస్‌లు వంద శాతానికి చేరనున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు కొన్ని కంపెనీల కరోనా టీకాల డోసులు పంపిణీ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) జారీ చేసింది. డీసీజీఐ నుంచి సాధారణ అనుమతి పొందిన క్రమంలోనే టీకాల ధరలను ఫార్మా సంస్థలు నిర్ణయించనున్నాయి.
సింగిల్ డోసు రూ.275గా నిర్ణయించే ఛాన్స్ :
సాధారణంగా టీకా ధర బహిరంగ మార్కెట్లో రూ.275గా నిర్ణయించే అవకాశం ఉంది. దీనికి రూ.150 సర్వీసు రుసం అదనంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం ప్రైవేటులో కొవాగ్జిన్ ఒక డోసు ధర సర్వీసు రుసుంతో కలిపి రూ.1200కు అందుబాటులో ఉంది. కొవిషీల్డ్ ధర రూ.780 గా ఉంది. గతేడాది జనవరి 3న అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఈ రెండు టీకాలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.
కొన్ని షరతులకు లోబడి ఈ రెండు టీకాలను వయోజనులకు ఇచ్చేందుకు సాధారణ అనుమతి ఇవ్వాలని జనవరి 9న ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధారణ అనుమతి కోసం అవసరమైన సమాచారాన్ని డీసీజీఐకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలు అందించాయి.
Read Also : కరోనాను ఓడించాలంటే ఈ జాగ్రత్తలే మీకు రక్ష!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world