Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Covishield Vaccine : కొవిషీల్డ్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్.. బూస్టర్ డోసు తీసుకోకపోతే వేస్టే!

Covishield Vaccine : కరోనా టీకా తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ టీకా ప్రభావ వంతంగా పని చేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది. దిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కొవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండు సార్లు ఆయన ... Read more

By Vinod Kumar

Published on: April 26, 2022 5:30 PM

Updated on: April 26, 2022 5:41 PM

---Advertisement---

Covishield Vaccine : కరోనా టీకా తాజాగా పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ టీకా ప్రభావ వంతంగా పని చేయడం లేదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. నేషనల్ ఇన్ స్టిట్ట్యూట్ ఆఫ్ వైరాలజీ తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడి అయినట్లు స్పష్టం చేసింది. దిల్లీకి చెందిన ఓ 38 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోవడానికి ముందు ఒకసారి కొవిషీల్డ్ తీసుకున్నారు. తర్వాత రెండు సార్లు ఆయన కరోనా బారిన పడ్డారు. గతంలో కరోనా సోకి, కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్న వారి రోగ నిరోధక వ్యవస్థనూ ఒమిక్రాన్ సమర్థంగా ఎదుర్కోగల్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇలాంటి వారు కొవిడ్ రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోస్ కూడా కచ్చితంగా తీసుకోవాల్సిందేనని వివరించారు.

Covishield Vaccine
Covishield Vaccine

పరిశోధకులు కథనం ప్రకారం.. ఆ ఆరోగ్య కార్యకర్తకు తొలి సారిగా 2020 అక్టోబర్ 9న కొవిడ్ పాజిటివ్ వచ్చిందట. ఏడాది తర్వాత అంటే 2021 నవంబర్ లో అతడిలో మళ్లీ కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే పరీక్ష చేయించుకుంటే డెల్టా వేరియంట్ సోకిందని వెల్లడైంది. రెండు నెలల్లోనే మరోసారి కూడా కరోనా సోకింది. తాజాగా ఈ సంవత్సరం అంటే 2022 జనవరి 24న ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. ఆ ఆరోగ్య కార్యకర్త కొవిషీల్డ్ టీకా మొదటి డోసును 2021 జనవరి 31న, రెండో డుసును మార్చి 3న తీసుకున్నారు. టీకా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ వేరియంట్ పై మెరుగైన రోగ నిరోధకు స్పందనను కలిగిస్తున్నందున కొవిషీల్డ్ తీసుకున్న వారు కచ్చితంగా వేయించుకోవాలని చెబుతున్నారు. అప్పడే కోరనా నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే మీరు కొవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకొని ఉంటే… బూస్టర్ డోసు కూడా కచ్చితంగా తీసుకోండి.

Read Also : Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..