Chandra Grahan 2022 : చంద్రగ్రహణంలో గ్రహాల కలయిక వల్ల ఈ రాశుల వారికి అనుకోని కష్టాలు.. ఆ దేవుడే కాపాడాలి..!

Chandra Grahan 2022 : ఈ సంవత్సరంలో చివరిలో నవంబర్ 8న రెండో చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం 16 మే 2022న ఏర్పడింది. అయితే కార్తీక పూర్ణిమ రోజున రెండో చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని భారతదేశంలో అనేక ప్రదేశాలలో చూడవచ్చు. దేశంలో నవంబర్ 8 సాయంత్రం 5:20 గంటలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సాయంత్రం 6.20 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. అందుచేత ఈరోజు ఉదయం 9.21 గంటల నుంచి సూతకం ప్రారంభం కానుంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. సంవత్సరంలోని చివరి చంద్రగ్రహణం అనేక రాశుల వారికి మంచిది. మరికొన్ని రాశులకు మాత్రం అనేక ఇబ్బందులను కలిగించనుంది.

Advertisement
Chandra Grahan 2022 _ These 4 Zodiac Signs Most Affected on Lunar Eclipse 2022
Chandra Grahan 2022 _ These 4 Zodiac Signs Most Affected on Lunar Eclipse 2022

ఈ చంద్రగ్రహణంలో నాలుగు గ్రహాల కలయిక కూడా ఏకకాలంలో జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి రాశివారిలో వారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం మేషరాశిలో జరగబోతోంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే.. చంద్రగ్రహణం రోజున శని, సూర్యుడు, రాహువు, అంగారక గ్రహాలు ముఖాముఖిగా ఉంటాయి. అదే సమయంలో, తులారాశిలో సూర్యుడు, చంద్రుడు, శుక్రుని కలయిక జరుగుతుంది.

Advertisement

Chandra Grahan 2022 : ఈ గ్రహాల కలయికతో ఈ 4 రాశుల వారికి ఇబ్బందులు తప్పవు..

దీంతో పాటుగా శని 5వ స్థానమైన కుంభం, కుజుడు మిథునరాశిలో 9వ ఇంటిపై సంయోగం చేయడం వల్ల వినాశకరమైన యోగం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ చంద్ర గ్రహణం అనేక రాశుల వారికి తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రత్యేకించి చంద్రగ్రహణం ఈ రాశులపై అశుభ ప్రభావం చూపనుంది. గ్రహాల కలయిక కారణంగా చాలా రాశుల వారి జీవితంలో అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు ఆర్థిక, శారీరక, మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వృషభం, మిథునం, కన్య, తులారాశి మరియు వృశ్చికరాశిపై చంద్రగ్రహణం చాలా చెడు ప్రభావాన్ని చూపనుంది. అందుకే ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని మహా పండితులు చెబుతున్నారు.

Advertisement

Read Also : Guru Nanak Jayanti 2022 : మీ స్నేహితులకు, బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!

Advertisement
Advertisement