Horoscope Today March 17 : మార్చి 17 రాహు-కేతువుల సంచారం.. మీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటే?

Horoscope Today March 17 : రాహువు కేతువుల స్థానాలు మారిపోతున్నాయి. మార్చి 17, 2022న రాశిచక్రంలో తమ స్థానాన్ని మార్చుకోనున్నారు. రాహువు వృషభం నుంచి మేష రాశికి, కేతువు వృశ్చికం నుంచి తులారాశికి మారనున్నారు. రాబోయే 18 నెలల్లో వివిధ రాశుల వారికి ఈ గ్రహాలు మీ భావోద్వేగ, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తాయో ఓసారి పరిశీలిద్దాం..

మేషం : మీలో కొత్త ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. మీ ముక్కుసూటి తత్వం, ముఖంపై మాట్లాడే గుణం వల్ల మీకు సన్నిహితంగా ఉన్నవారిని బాధపెడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఉన్నవారు కొత్త వారిని కలుసుకుంటారు. పెళ్లైన జంటలు ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి.

వృషభం : మీరు అందం కొనితెచ్చుకునేందుకు డబ్బు ఖర్చు చేయొచ్చు. ఇతరులను మీ అందంతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. వివాహమైన వ్యక్తులు కొన్ని సంబంధాలతో సమస్యలను ఎదుర్కొంటారు. వారి వ్యక్తిగత జీవితాలపై అసంతృప్తిని కలిగి ఉంటారు. వృత్తిపరమైన కట్టుబాట్ల వల్ల వీరు తాత్కాలికంగా విడిపోయే అవకాశం ఉంది.

Advertisement

మిథునం : స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేస్తుంటే.. మీరు వారి పట్ల మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. అది మిమ్మల్ని మరింత సన్నిహితంగా ఉండటానికి దారి తీస్తుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఒంటరిగా ఉన్నవారు కొత్త భాగస్వాములను కలుసుకుంటారు.

Horoscope Today March 17 : How Rahu-Ketu Transit will impact your life on March 17, 2022, You Must Know
Horoscope Today March 17 : How Rahu-Ketu Transit will impact your life on March 17, 2022, You Must Know

కర్కాటకం : మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. ఫలితంగా మీలో ప్రేమ పుట్టవచ్చు. మీరు కొత్త వారిని కలుసుకోవచ్చు. వివాహం చేసుకున్న వారు తమ వృత్తిపరమైన ఎదుగుదలకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. దీర్ఘకాలిక లక్ష్యానికి ఒక అడుగు దగ్గరగా ఉంటారు. తక్కువ ఆలోచించి ఎక్కువ చేయడమే విజయానికి మార్గమని గుర్తించాలి.

సింహ రాశి : మీ కుటుంబంతో కలిసి సుదీర్ఘ ప్రయాణం సాగించే అవకాశం ఉంది. విదేశాలలో ఉంటున్న మీ కుటుంబ సభ్యులలో కొందరిని కలిసే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల శ్రేయస్సు గురించి ఆలోచించండి. మీ తండ్రి సలహాను విస్మరించొద్దు.

Advertisement

కన్య : స్నేహితులు, మీకు తెలిసినవాళ్లు మీతో చిన్న ప్రయాణాలు చేయవచ్చు. మీతో మీ తల్లికి ఉన్న కొన్ని విభేదాలు బయటపడొచ్చు. వృత్తిపరమైన కారణాల వల్ల మీరు ఎక్కువ కాలం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఇంటి నుంచి దూరంగా ఉండవలసి రావచ్చు. నిశ్శబ్దంగా, దూరంగా ఉండటం మానుకోండి. లేకపోతే మీరు ఇతరులపై ఆసక్తి లేని వ్యక్తిగా పరిగణించే అవకాశం ఉంది.

తుల రాశి : వివాహం చేసుకోవాలని ఆసక్తిని కనబరుస్తారు. మీకు నచ్చినవారిని ఎంచుకోవడంలో గందరగోళానికి గురికావొచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు తారసపడొచ్చు. మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉన్నప్పటికీ మీ ఆలోచనలను మీలోనే ఉంచుకుంటారు. వ్యక్తిగత జీవితంలో నిర్లిప్త భావం పెరుగుతుంది.

వృశ్చిక రాశి : నిబద్ధతతో ఉన్నవారు దిక్కుతోచని స్థితిలో ఉంటారు. పరస్పరం ఆసక్తిని కోల్పోతారు. మీ ప్రియమైన వారితో విషయాలను చర్చించాలి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇస్తారు. మీ ప్రతిష్టను దెబ్బతీసే విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

Advertisement

ధనుస్సు : గతంలో కుటుంబ, బంధుత్వ సవాళ్లను ఎదుర్కొన్న వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుంది. డేటింగ్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఇది మంచి క్షణం. మీరు ఒకరితో ఒకరు ప్రేమలో మునిగితేలుతారు. దీర్ఘకాలిక సంబంధాల కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశం.

మకరం : మీరు మీ ఇంటికి గృహోపకరణాలు అలంకారాలను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోబుట్టువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. మీరు మీ పనిలో ఎక్కువ సమయం గడుపుతారు. మీ సొంతంగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభం : మీకు కొత్త జీవితంపై ఆసక్తిని చూపిస్తారు. మీరు కొత్త స్నేహితులను కలుసుకుంటారు. మీ తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కఠినమైన మాటలు, దూకుడు చర్యలు మీ బాంధవ్యాల్లో విభేధాలకు దారితీయొచ్చు. మీ ఇంట్లో పెద్దవారు అనారోగ్యానికి గురికావొచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

మీనం : కొత్త వ్యక్తులను కలుస్తారు. ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటారు. మీ తల్లికి మీకు మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కానీ, కుటుంబ సమస్యలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

Read Also : Horoscope Today 10 March 2022 : ఈ రోజు ఈ రాశివారికి గడ్డుకాలమే.. ఏయే రాశులతో ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel