Zodiac Signs : ఈ రాశుల వారిని విమర్శిస్తే అస్సలు భరించలేరట.. మాట అనే ముందు జాగ్రత్త..!

Zodiac Signs : మనిషి తన జీవితంలో ఏదైనా పని చేసినా, చేయకపోయినా.. ఖాళీగా ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేసిన పని కొందరికి నచ్చవచ్చు. మరికొందరికీ నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని నిబంధన ఏమీ లేదుగా.. ఎవరైనా మెచ్చుకుంటే విని ఆనందించాలి.. కానీ విమర్శించినా లైట్ తీసుకోవాలి. దానిని పట్టుకుని బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్లడం చాలా కష్టం..

కొన్ని సందర్భాల్లో మనకు దగ్గర అనుకునేవాళ్లు, స్నేహితుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతాయి. అభిప్రాయ భేదాల వలన కూడా ఎదుటి వారి నుంచి విమర్శలు రావొచ్చు. వీటిని విని ఊరుకోవాలే కానీ వారిపై ప్రతీకారాలకు పోకూడదు. అయితే, కొందరు వ్యక్తులు మాత్రం ఎవరైనా విమర్శించినా, కటువుగా మాట్లాడినా అస్సలు తట్టుకోలేరట.. వారు ఇలా ప్రవర్తించడానికి వారి జాతక చక్రం, రాశిఫలాలే కారణమని తెలుస్తోంది. కొన్ని రాశుల వారిలో ఇటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయట.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

5 Zodiac Signs most emotionally Sensitive As Per Astrology
5 Zodiac Signs most emotionally Sensitive As Per Astrology

సింహ రాశి వారు సాధారణంగా తామే ఎల్లప్పుడూ ఉత్తమమని భావిస్తారట.. ఎవరైనా ఎమైనా అంటే అస్సలు తట్టుకోలేరని తెలుస్తోంది. ఈ రాశి వారికి సహజంగా తాము తప్పు చేయబోమని ఆత్మవిశ్వాసంతో ఉంటారట.. ఇలాంటి టైంలో ఎవరైనా పల్లెత్తూ మాట అంటే తెగబాధపడుతారని తెలిసింది. వీరికి విమర్శలను ఎదుర్కోవడం తెలియదు. చిన్న విషయానికే విపరీతమైన కోపం తెచ్చుకుంటారు.విమర్శలను తమ పరువుభంగంగా భావిస్తారని తెలుస్తోంది.

Advertisement

Zodiac Signs : ఇందులో మీ రాశి ఉందో చూసుకున్నారా? 

కన్యారాశి కలిగిన వ్యక్తులు ఇతరుల కంటే తమలో మెరుగైన నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్నాయని నమ్ముతారు. పక్కవారితో పోలిస్తే తామే బెస్ట్ అని అనుకుంటారు. ఏదైనా పని చేసినపుడు ఎవరైనా తప్పులు ఎంచినా.. తమ పనిని విమర్శించినా తెగ ఫీలవుతారట.. తాము చేసిందే కరెక్ట్ అని.. మీరు చెప్పేది తప్పని ఎదుటి వారితో వాదిస్తుంటారు.

ధనుస్సు రాశి.. ఈ రాశి కలిగిన వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని తెలుస్తోంది. వీరు విమర్శలను తమ ఎదుగుదలకు తొలి మెట్టు అని భావించలేరట.. కానీ ప్రశ్నించే అలవాటును మాత్రం కలిగి ఉంటారు. ఇతరులు ఎవరైనా విమర్శించినా.. తప్పు చూపించినా అస్సలు తట్టుకోలేరని తెలిసింది.

Read Also : Zodiac Signs : శనిదేవుని సంచార ప్రభావం వల్ల 3 నెలలపాటు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel