RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తేదీ థియేటర్లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే థియేటర్లో అన్ని భాషలలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకుంది.
జీ 5 ద్వారా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.ఇక ఈ పాటకు సంబంధించి ఎంతో మంది డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా, దేత్తడి హారిక మరోసారి నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement
అయితే అందరిలా సినిమాలో ఉన్న స్టెప్పులను కాకుండా సరికొత్త స్టైల్లో ఈ పాటకు డాన్స్ వేస్తూ ఈ డాన్స్ వీడియో ని అభిమానులతో పంచుకున్నారు. అయితే వీరిద్దరూ RRR సినిమాను ఓటీటీ ప్రమోషన్లో భాగంగా ఈ స్టెప్పులు వేస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతో మంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
Read Also :మళ్లీ ఒక్కటవుతున్న షన్నూ.. దీప్తి సునైనా.. ఇదిగో సాక్ష్యం..!