Anasuya Bharadwaj : బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. తన మాట్లాడినా, చిలిపిగా నవ్వినా అలా చూడాలని అనిపిస్తుంటుంది. అంతటి అందం, అణుకువ, అమాయకత్వం కలగలిపిన ఫేస్ ఉంది కాబట్టి అటు బుల్లితెరను, ఇటు వెండి తెరనూ ఊపేస్తోంది. ఇటీవలే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాటీవలో ప్రసారమయ్యే పాటల ప్రోగ్రాంలతోపాటు పలు షోలను చేస్తోంది. బయట సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ బిజీబిజీగా గడుపుతోంది. జబర్దస్త్ కు వీడ్కోలు పల్కి స్టార్ మాలో కీలక పాత్ర పోషిస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ షోలో సందడి చేస్తోంది.
అయితే తాజాగా సూపర్ సింగర్ షో ఎపిసోడ్ లో తనలోని కొత్త టాలెంట్ ని అభిమానులకు చూపించింది. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు.. విరహాల గోల ఇంకానా వీలు కాదంటూ విరహ గీతం ఆలపించింది. అనసూయ అంత స్వీట్ గా, క్యూట్ గా పాడిన పాట చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ గాయకుడు, జడ్జితో కలిసి ఓ రొమాంటిక్ పాటను పాడి అందరిలో సెగలు పుట్టించింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె పాడిన పాటను షేర్ చేస్తూ లైకులు కొడ్తున్నారు.
https://youtu.be/Ea7RR8cThaI