Darja Movie Review : రంగస్థలంలో రంగమ్మత్తగా.. పుష్పలో దాక్షాయణిగా నటించి యాంకర్ అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే రోల్ ఎంచుకోవడం.. లేడి ఓరియెంట్ వంటి పాత్రల్లో ఒదిగిపోతూ దూసుకెళ్తోంది అనసూయ.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు ఒక్క ఎత్తు అయితే.. ఇప్పుడు వచ్చిన మూవీ మరో ఎత్తు.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. దర్జా (Darja Movie Review) మూవీ. ఈ దర్జా మూవీలో అనసూయ.. లేడీ డాన్‌గా కనిపించింది.

కనక లక్ష్మి పాత్రలో ఒక ఊరిని శాసిస్తూ తన పర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించింది. స్టార్ కమెడియన్, హీరో సునీల్ ప్రధాన పాత్రలో నటించగా.. కొత్త దర్శకుడు సలీమ్ మాలిక్ దర్జా మూవీకి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీలో టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీ రోల్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఈ సినిమా మంచి బిజినెస్ కూడా పర్వాలేదనిపించేలా చాలా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇంతకీ అనసూయ నటించిన దర్జా మూవీ ఎంత దర్జాగా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..
ఆమె పేరు.. కనక మహాలక్ష్మి.. ఆ ఊళ్లో ఆమే లేడి డాన్.. ఆమె చెప్పిందే వేదం.. ఆమే మాటే శాసనం.. బంధర్ సిటీలో తన మాటతోనే శాసిస్తుంది. బందర్ సిటీలో ఆమె గుండాగిరికి ఎవరైనా వణికిపోవాల్సిందే. పెద్ద గూండాలు తయారుచేసి చీప్ లిక్కర్ అమ్ముతూ అనేకమంది ప్రాణాలను బలిగొంటుంది. ఆమెను ఎదురించేవాళ్లు ఉండరు. పోలీసులు కూడా ఆమెకు భయపడిపోతుంటారు. అదే సమయంలో ఆ సిటీలోకి ఏసీపీ శివశంకర్ (సునీల్)ను బదిలీ చేస్తారు. మితిమీరిపోతున్న నేరాలను కంట్రోల్ చేసేందుకు సిటీలోకి అడుగుపెడతాడు. అప్పటినుంచి లేడీ డాన్ అనసూయకు సిన్సీయర్ పోలీసు సునీల్‌కు మధ్యలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి అనేది మూవీలోనే చూడాల్సిందే..
నటీనటులు వీరే :
యాంకర్ అనసూయ భరద్వాజ్, సునీల్, అక్సాఖాన్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించగా.. PSS ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో శివశంకర్ పైడిపాటి ఈ మూవీని నిర్మించారు. సంగీతాన్ని రాప్ రాక్ షకీల్ అందించాడు.
Movie Name : | దర్జా (Darja Movie) |
Director : | సలీమ్ మాలిక్ |
Cast : | సునీల్, అనసూయ భరద్వాజ్, షకలక శంకర్, అక్సాఖాన్ |
Producers : | శివశంకర్ పైడిపాటి |
Music : | ‘రాప్ రాక్’ షకీల్ |
Release Date : | 22 జులై 2022 |
Darja Movie Review : దర్జా మూవీ రివ్యూ – కనక మహాలక్ష్మిగా అనసూయ మెప్పించిందా?

ప్రస్తుత రోజుల్లో మాస్ ఆడియోన్స్ పల్స్ పట్టుకోవాలంటే.. అలాంటి మాస్ మూవీలు రావాల్సిందే.. అందుకే ఇప్పుడు వచ్చే మూవీలు దాదాపు మాస్ యాంగిల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ అందుకుంటున్నాయి. దర్జా మూవీ కూడా మాస్ ఆడియన్స్ కోసం వచ్చిందే.. అయితే ఈ మూవీలో బలహీనమైన స్క్రిప్ట్ మైనస్ అని చెప్పవచ్చు.
అదే మాస్ ఆడియన్స్‌ను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయిందని చెప్పాలి. ఈ మూవీ మొదలైన అప్పటినుంచే చూస్తే.. అంతగా పాత సన్నివేశాలనే తలపించేలా ఉన్నాయి. చూసినా సీన్లనే మళ్లీ చూస్తున్నామా అనే ఫీలింగ్ రాకమానదు. ఒకరంగా ప్రేక్షకుడి సహనానికి ఒక పరీక్ష అన్నట్టే.. క్యారెక్టరైజేషన్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. అప్పుడు కాస్తైనా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేదేమో.. ఏది ఏమైనా మూవీలో సన్నివేశాలు రొటీన్ మాదిరిగా అనిపించాయి.
ఇక సిన్సియర్ పోలీసు అధికారిగా సునీల్ ఆకట్టకునే ప్రయత్నం చేశాడు. సీరియస్ రోల్‌లో సునీల్‌ను అందులోనూ ఆయన తన హస్కీ టోన్ ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అయ్యేలా కనిపించలేదు. అనసూయ భరద్వాజ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. మిగతా నటీనటులూ తమ పాత్రలకు తగినట్టుగా నటించి మెప్పించారు. సాంకేతికపరంగా చూస్తే మూవీ యావరేజ్ అని చెప్పవచ్చు.
షకీల్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ సేపు నాయిజ్ వింటే.. ఎంతమాత్రం ఆకట్టకున్నట్టుగా కనిపించలేదు. సినిమాటోగ్రాఫర్ దర్శన్ కూడా మెప్పించలేకపోయారు. దర్శకుడు సలీమ్ మాలిక్ కూడా తన దర్శకత్వ పనితీరును అనుకున్నట్టుగా ప్రేక్షకులకు చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఏదిఏమైనా మాస్ ఆడియోన్స్ ను థియేటర్లకు రప్పించేంత మూవీ కాకపోయినా.. అనసూయ ప్రయత్నాన్ని మెచ్చుకునేందుకు అయినా థియేటర్లలోకి వెళ్లి ఓసారి చూడొచ్చు.
[ Tufan9 Telugu News ]
దర్జా మూవీ (Darja Movie Review)
రివ్యూ & రేటింగ్ : 2.5 /5