Anasuya Bharadwaj : బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన మార్క్ చూపిస్తూ వస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. విలక్షణ పాత్రలలో సినిమాల పరంగా కూడా సక్సెస్ అయినప్పటికీ పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ చేస్తూ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. ఈసారి దర్జా అనే మూవీ తో మన ముందుకు వస్తుందట ఈ విషయం తానే స్వయంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది.ఈ సినిమాని కామినేని శ్రీనివాస్ సమర్పణలో తెరకెక్కించడం జరుగుతుంది. పి ఎస్ ఎస్ సునీల్, అనసూయ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సలీం మాలి
క్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌లో అనసూయ పాల్గొని మాస్ స్పీచ్ ఇచ్చింది. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనసూయ మాట్లాడుతూ.. ముందుగా ఇండస్ట్రీ పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లు అరవింద్, వెంకటేష్, సురేష్ బాబు, డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లాక్ డౌన్ పర్సనల్ కారణాల వల్ల నేను ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేక పోయినందుకు సభాముఖంగా దర్జా మూవీ టీంకి క్షమాపణలు తెలియజేస్తున్నాను.
నేను ఈ సినిమా చేయడానికి కారణం ఇద్దరే ఇద్దరు ఒకరు ప్రభు, మరొకరు షకీల్ అని అనసుయ తెలిపింది. ఈ సినిమాలో నేను కనకం అనే పాత్రలో నటించాను. నాతో పాటు సునీల్ శిరీష , అక్ష ఖాన్, షణ్ము, సమీర్ తదితరులు నటించారు. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఇలాంటి యాక్షన్ సినిమా చేశాను. గొడుగు తిప్పేసి ఉంచారో లేదో తెలీదు కానీ సింగల్ హ్యాండ్‌తో గొడుగు ఇప్పించారు. చీరతో విన్యాసాలు కూడా చేయించి నాతో భయపెట్టడానికి ప్రయత్నించారు.
Anasuya Bharadwaj : చీల్చి చండాడేస్తా.. నా కొడకల్లారా’ అంటూ అనసూయ మాస్ డైలాగ్..
మీరు కూడా థియేటర్లలో భయపడడానికి సిద్ధంగా ఉండండని అనసుయ డైలాగ్ విసిరింది. థియేటర్‌కి వచ్చి ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరింది. నాలుగు గోడల మధ్య సినిమా చూడాలి అని కోరుకోకండి. నెల లోపు వచ్చేస్తుంది కదా అనుకోకండి. నీ అనసూయను చూడాలనుకున్నప్పుడు ఓటీటీలో చూడండి అంటూ తెలియజేసింది. చివరిగా ‘నువ్వు బెదిరిస్తే భయపడడానికి ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా.. చీల్చి చండాడేస్తా.. నా కొడకల్లారా’ అంటూ మాస్ డైలాగ్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అనసుయ మాస్ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also : Sreeja Third Marriage : షాకింగ్ ట్విస్ట్.. శ్రావణంలో శ్రీజ మూడో పెళ్లి.. చిరంజీవిని ఒప్పించింది ఆయనే..?!