Anasuya comments: అమ్మని అన్న ఉసురు ఊరికే పోదంటూ అనసూయ కామెంట్లు, ఎవరి కోసమో?

Anasuya comments: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన చిత్రం లైగర్. ఫ్యాన్స్ అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమా లేకపోవడంతో చాలా మంది హర్ట్ అయ్యారు. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాథ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు.

Advertisement

హిందీలో కూడా ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయిది. కానీ సినిమా విడుదలయ్యాక అంచనాలన్నీ తారుమారయ్యాయి. పూరి జగన్నాథ్ తో పాటు విజయ్ దేవరకొండ విపరీతమైన ట్రోల్స్ కు గురవుతున్నారు. బోల్డ్ యాటిట్యూబ్ అన్ని సమయాల్లో వర్కౌట్ కాదని చెప్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్, హీరోయిన్ అనన్య పాండే దేశమంతటా తిరిగారు.

Advertisement

ఇదిలా ఉండగా.. తాజాగా యాంకర్ అనసూయ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదంటూ.. కర్మ కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అని తెలిపింది. అలాగే ఎదుటి వారి బాధను చూసి సంతోష పడడ లేదు కానీ ధర్మమే గెలిచిందంటూ ట్వీట్ చేసింది. ఈమె చేసిన ట్వీట్లపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.

Advertisement