Actress suhasini : సీనియర్ నటి సుహాసిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఆమె డైరెక్టర్ మణిరత్నంని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, పిన్ని పాత్రల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సుహాసిని హైదరాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అంతే కాదండోయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సుహాసిని ఓ పెట్టింది.
ఆ ఫోటో చూసిన ఓ నెటిజెన్ 16 ఏళ్ల పడుచు పిల్లలా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేసింది. అయితే ఆ కామెంట్ చూసిన సుహాసిని నవ్వుకుంటూ ఆ నెటిజెన్ కు రిప్లై ఇచ్చింది. హహహ అని నవ్వుతూనే ఈ నెంబర్ ను రివర్స్ చేస్తే అదే నిజం అవుతుందంటూ చెప్పింది. అయితే తన వయసు 16 కాదు 61 అని చెప్పుకొచ్చింది. ఇలా నెటిజెన్ తో జరిగిన సుహాసిని ఫన్నీ కాన్వర్జేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
Read Also : Actress Poojitha : మెగాస్టార్ పరువు గోవిందా అంటూ సీనియర్ నటి కామెంట్లు..!