Actress Poojitha : మెగా డాటర్ శ్రీజ తన భర్త కల్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతుందని.. అంతటితో ఆగకుండా మూడో పెళ్లి కూడా చేస్కుంటుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎక్కడా చూసినా ఇవే వార్తలు. అయితే వీటిపై ఇరు కుటుంబాల సభ్యలు స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి పూజిత మెగా డాటర్ శ్రీజ మూడో పెళ్లిపై ఆసక్తికర కామెంట్లు చేసింది. సినీ ఇండస్ట్రీలో మంచి పేరు మర్యాదలున్న చిరంజీవి కూతురు.. ఇలా మూడో పెళ్లి విషయంలో స్థిరమైన మైండ్ సెట్ తో ఉండకపోవడం కరెక్ట్ కాదంటూ చెప్పింది.
శ్రీజ మనస్తత్వం స్థిరంగా లేకపోవడం వల్లే.. చిరంజీవి పరువు పోతుందంటూ వ్యాఖ్యానించింది. శ్రీజ బిహేవియర్ ఏమాత్రం సరిగ్గా లేదని, ఆమెకు అడ్జస్ట్ అయి బతికే మెంటాల్టీ కాదని వివరించింది. ఇంట్లో చేసిన అతి గారాబం వల్లే శ్రీజ ఇలా తయారైందంటూ పూజిత సంచలన కామెంట్లు చేసింది. శ్రీజ మూడో పెళ్లి చేస్కోకుండా ఉండటమే మంచిదని.. అప్పుడు తన నాన్న చిరంజీవి పరువు నిలబెట్టింది అవుతుందంటూ చెప్పింది. మరి శ్రీజు కల్యాణ్ దేవ్ తో విడాకులు తీస్కొని మూడో పెళ్లి చేస్కోనుందా లేదా తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.
Read Also : Sreeja husband: కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్… శ్రీజను ఉద్దేశించే పెట్టాడా ?