Turmeric on shivalingam: శివుడిని లయకారుడు అంటారు. శంకరుడు తనను ఎలా పూజించినా వెంటనే ప్రసన్నుడై భక్తుల కోరికలను నెరవేరుస్తాడని ప్రజల నమ్మకం. అందుకే శివుడిని భోళా శంకరుడు అంటారు. అయితే శివుడుని లింగ రూపంలోనే ఎక్కువగా పూజిస్తుంటారు. అయితే కొన్నింటిని శివారాధనకు అస్సలే ఉపయోగించకూడదని మన వేద పండితులు చెబుతున్నారు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన గంజాయి, ఉమ్మెత్తే, బిళ్వ పత్రం, గంధం, భస్మం, పచ్చి పాలను వాడితే మంచిదంటారు. అలాగే శివుడిపై మహిళలు పసుపు అస్సలే వేయకూడదని వివరిస్తుంటారు. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పసుసును ఎక్కువగా స్త్రీల అందం కోసం వినియోగిస్తుంటారు. అందుకే శివుడికి పసుపు అంటే ఇష్టం ఉండదట. అందకోసమే శివ లింగంపై పసుపు వేయడం నిషిద్ధమని నమ్ముతారు. సాధారణంగా శివుడు కాకుండా మరే దేవుతకు అయినా, దేవుడికి అయినా పసుపును సమర్పించడం మంగళకరంగా భావిస్తారు. అలాగే సింధూరం, తులసి ఆకులను కూడా శివ పూజ కోసం అస్సలే వినియోగించకూడదట.