Lord Shiva: ప్రతి సంవత్సరం పెరిగే శివలింగం గురించి ఎప్పుడైనా విన్నారా… ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Lord Shiva: సాధారణంగా మనకు ఏ ఆలయానికి వెళ్లిన శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. శివుడు విగ్రహ రూపంలో కాకుండా ఇలా లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చే ఇస్తూ ఉంటారు.అయితే మనం ఏ ఆలయంలోనైనా ఒకసారి విగ్రహాన్ని లేదా లింగాన్ని ప్రతిష్టించిన అప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా అదే పరిమాణంలో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

శ్రీకాకుళం జిల్లాలోని ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో వెలసిన శివలింగం ప్రతి ఏటా బియ్యపు గింజ ఎత్తు పెరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ శివలింగం ఎలా ఎత్తు పెరగడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే పురాణాల ప్రకారం ఈ శివ లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు ప్రతిష్టించారని తెలుస్తోంది.ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించినప్పటికీ ఆలయం నిల్వ లేదు అందుకే స్వామివారు ఎండలకు ఎండుతూ వానకు తడుస్తూ ఇక్కడే కొలువై ఉన్నారు. ఇలా ఎండలకు ఏండుతూ భక్తులకు దర్శనం ఇవ్వడం వల్ల స్వామివారికి ఎండల మల్లికార్జున స్వామిగా పేరు పొందారు.

పూర్వం ఒరిస్సాకు చెందిన రాజులు కూడా స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని భావించారు. అయితే ప్రతి ఏటా స్వామి వారి లింగం పెరగటం వల్ల ఆలయం నిర్మించడానికి సాధ్యపడలేదు. ఇక ఈ స్వామివారిని తాకి వచ్చే గాలిని పీల్చడం వల్ల ఎలాంటి రోగాలు ఉండవని అక్కడి ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఇక ఈ గ్రామంలో ఎక్కువమంది స్వామివారి పేర్లు పెట్టుకుంటారు. సంతానం లేని వారు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకోవడం వల్ల సంతానం కలుగుతుందని భావిస్తారు. ఇక మాఘమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్న స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel