Guppedantha Manasu : వసు అందాన్ని పొగిడిన రిషి.. తల్లీ, కొడుకులను దూరం చేయడానికి మరో ప్లాన్ చేసిన దేవయాని!

Updated on: February 1, 2022

Guppedantha Manasu Feb 1 Episode Today : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక స్టోర్ లో వసు వేలికి చిన్న పుల్ల గుచ్చుకుంటే రిషి తన నోటితో ఆ పుల్లను తీస్తూ ఉండగా ఆ గ్యాప్ లో వీరిరువురూ మంచి లవ్ సాంగ్ వేసుకుంటారు.

Guppedantha Manasu Feb 1 Episode Today
Guppedantha Manasu Feb 1 Episode Today

ఎట్టకేలకు రిషి ఆ వేలుకు దిగిన పుల్లను తన నోటితో తీసివేస్తాడు. ఈలోపు అక్కడికి గౌతమ్ వచ్చి వాళ్ళిద్దరి మూడ్ అవుట్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పాత చెక్కలు మోసుకొచ్చే పని గౌతమ్ కు అప్పజెప్పి అక్కడినుంచి వెళతారు. ఒకవైపు ధరణి జగతితో కలిసి ఆనందంగా చిల్ అవుతుంది. అది చూసిన దేవయాని ఇలా మాట్లాడుతుంది.

“ఏం ధరణి పార్టీ మార్చినట్టు ఉన్నావ్” అని అడుగుతుంది. ఆ తర్వాత భోగి మంటల ముందు వసుధార ఒక ఫోక్ సాంగ్ ప్లే చేయగా గౌతమ్, మహేంద్ర లు ఒక రేంజ్ లో స్టెప్పులు వేస్తారు. ఆ తర్వాత రిషి ఇంటి ద్వారానికి పూలమాల కడుతూ ఉండగా ఆ పూల మాల కిందకు జారి వసు మెడలో పడుతుంది. ఆ మూమెంట్లో రిషి, వసు లు ఓ సాంగ్ వేసుకుంటారు.

Advertisement

మరోవైపు జగతి, మహేంద్ర లు పక్క పక్కన కూర్చుని తోరణాలు కడుతూ ఉంటారు. ఒకవైపు గౌతమ్ వసు మీద పూలు చల్లడానికి ప్లాన్ చేస్తాడు. అలా గౌతమ్ పూలు తీసుకు వస్తున్న క్రమంలో దేవయాని తగిలి ఆ పూలు జగతి, మహేంద్ర లా మీద తలంబ్రాలు గా పడతాయి.

Guppedantha Manasu Feb 1 Episode Today : ఈరోజు ఎపిసోడ్ లో జరిగేది ఇదే…

ఈలోగా అక్కడకు మీ ఫణీంద్ర వర్మ వచ్చి “మీ వదిన తనకు తెలియకుండానే మీ మీద పూల వర్షం కురిపించింది మహేంద్ర” అని అంటాడు. దానికి మహేంద్ర థాంక్స్ చెబుతాడు. దానికి దేవాయాని మనసులో మండిపడుతోంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఆనందంగా పాయసం తింటూ ఉంటారు.

కానీ దేవయాని మాత్రం కోపం గా ఉంటుంది. తరువాయి భాగంలో వసు విషయంలో బాగా జాగ్రత్తగా ఉంటాడు. తనకు ముందుగానే టాబ్లెట్స్ అందిస్తాడు. వసు అందం గా రెడీ కావడంతో తన అందాన్ని పొగుడుతాడు. ఇక జగతి తన కొడుకు రిషి కు కొత్త బట్టలు పెట్టడానికి ప్లాన్ చేస్తుంది. ఆ విషయాన్ని వసుధార కు చెబుతుంది.

Advertisement

ఆ విషయాన్ని చాటుగా ఉన్న దేవయాని ‘కొడుకు కి కొత్తబట్టలు పెడుతున్నావా.. దాంతోనే నీ కథకు అద్భుతమైన ముగింపు నేను ఇస్తాను’ అని దేవయాని మనసులో అనుకుంటుంది. మరి ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

Read Also :  Guppedantha Manasu: వసు మెడలో దండ వేసిన రిషి.. పూల వర్షం కురిపించిన దేవయాని!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel