Rashmi Sudheer : మరోసారి సుధీర్ పై ప్రేమను చాటిన రష్మీ… ఎప్పుడైనా ఇలా చూసి తీరాల్సిందే!

Rashmi Sudheer : బుల్లితెర జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే. ఈ జంటకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాకుండా వీరు రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుండు అని లక్షలాది మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ జంటకు రెండుసార్లు మల్లెమాల వారు పెళ్లి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రష్మీ సుధీర్ లు అప్పుడప్పుడు బుల్లితెరపై పలు ఈవెంట్లలో షోలలో రొమాంటిక్ సాంగ్ లకు డాన్సులు వేస్తూ ప్రేక్షకులను మరింత అలరిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సుధీర్, రష్మీలు అంతగా కనిపించడం లేదు.ఢీ షోలో వీరిద్దరు జంటగా కనిపించేవారు.

కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. బుల్లితెర పై రష్మీ, సుధీర్ ల పై చేసిన ఎన్నో ఈవెంట్లు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వీరిమధ్య ఏముందో కానీ ఆ కెమిస్ట్రీని ఎన్నిసార్లు చూసినప్పటికీ ప్రేక్షకులకు ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలా వీరిద్దరి ప్రేమకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. ఇది ఇలా తాజాగా హోలీ పండుగ సందర్భంగా మాటీవీ రిలీజ్ చేసిన ఒక ప్రోమో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.ఎందుకంటె ఇప్పటివరకు ఈటీవీ కే పరిమితైన రష్మీ-సుధీర్ లు మొదటిసారి మరో చానెల్ లో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

rashmi-again-fell-in-love-with-sudheer
rashmi-again-fell-in-love-with-sudheer

జబర్ధస్త్ షో వారు నిర్వహించే మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ లో ఒక్కసారి చేరాక ఇతర షోలు చేయడానికి వీలుండదని నిబంధనలు ఉల్లంఘిస్తే లక్షలు కట్టాలని నిబంధనలు ఉంటాయని బుల్లితెరపై ఓ టాక్ ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సుధీర్-రష్మీ తొలిసారి ఈటీవీ-మల్లెమాల వదిలేసి మాటీవీలో సందడి చేశారు. మాటీవీలోనూ హోలీ వేడుకకు యాంకర్ గా రష్మీ వచ్చింది.

Advertisement

మధ్యలో సర్ ప్రైజ్ గా సుధీర్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఈవెంట్ లో వీరిద్దరి మధ్య సాగిన ప్రేమలు, ఆప్యాయతలు ఓ సారి కొట్లాటను బయటపెట్టారు. వారి ప్రేమ ఊసులు పంచుకున్నారు. వారి కళ్లలో ఒకరంటే మరొకరికి ఎంత ఇష్టమో వీడియో ద్వారా తెలిసేలా చేశారు. ఈ ఈవెంట్ తో మరొకసారి సుధీర్-రష్మీ జోడీ ఎవర్ గ్రీన్ అని ప్రేక్షకులకు చవిచూపించింది.

Read Also : Sudheer -Rashmi: జబర్దస్త్ సుధీర్ రష్మి లవ్ స్టోరీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంద్రజ… రేటింగ్ కోసం కాదంటూ కామెంట్స్!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel