Viral Video: అందంగా ఉన్నారని అలానే చూస్తూ మై మర్చిపోయాడు.. అంతలోనే దారుణం!

Updated on: May 9, 2022

Viral Video: సాధారణంగా మనం మన కంటికి ఏదైనా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తే మనం మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను మన పనులను మరచిపోయి తదేకంగా వాటినే చూస్తూ ఉండిపోతాము. ఇలా చాలా మంది కొన్ని అందమైన వస్తువులకు ఆకర్షితులవుతున్నారు. అయితే తాజాగా ఒక వ్యక్తి కూడా ఇలాంటి అందానికి మంత్రముగ్ధుల్ని అయ్యాడు. చివరికి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. ఒక అందమైన జంట ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి సూట్ ధరించి ఉండగా తన భార్య వైట్ అండ్ వైట్ డ్రెస్ ధరించి చూడముచ్చటగా ఉన్న ఆ జంట ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ అందమైన దృశ్యాన్ని మరొక వ్యక్తి చూస్తూ తరించి పోయాడు.వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ కు అతను మైమరచిపోయి అలా నడుస్తూ వెళ్ళాడు.

అయితే అతను నడుస్తున్న దారిలో స్విమ్మింగ్ పూల్ ఉంది అనే విషయాన్ని కూడా గమనించకుండా వెళ్తూ ఆ వ్యక్తి ఒక్కసారిగా స్విమ్మింగ్ ఫూల్ పడిపోయారు. దీంతో ఆ వ్యక్తి తన లోకంలోకి వచ్చాడు. ఈ విధంగా ఆ వ్యక్తి స్విమ్మింగ్ పూల్ లో పడిపోగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఇక ఈ జంటకు ఫోటోలు తీస్తున్నటువంటి ఓ మహిళ కూడా తన కెమెరాకు విరామం ప్రకటించి ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయింది. వెంటనే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అతడిని పైకి లేపుతూ అనంతరం ఈ ఘటన తలచుకొని అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel