Viral video: మాల్ మధ్యలో నిలబడి ఎవరూ ఊహించనిది కొట్టేసిన వృద్ధ జంట!

Viral video: అరవై నాలుగు కళల్లో దొంగతనం కూడా ఒక కళ. దొంగతనం చేయాలంటే నిజంగా ఎంతో నేర్పు ఉండాలి. చాక చక్యంగా వ్యవహరించాలి. కళ్ల ముందు నుండే కావాల్సింది కొట్టేయ గలగాలి. అందుకు నైపుణ్యంతో పాటు గుండెల నిండా ధైర్యం కావాలి. కొందరు చేసే దొంగతనం చాలా నేర్పుగా ఉంటుంది. కళ్ల ముందు నుండే తమకు కావాల్సింది కొట్టేస్తారు. వాళ్లు కొట్టేసిన విషయం కూడా తెలియకుండా ఉంటుంది. అది అసలు సిసలు దొంగతనం అంటే. రెండో కంటికి తెలియకుండా జరిగిపోవాలి దొంగతనం. కానీ ఇక్కడ ఉన్న దొంగలను చూడండి. వారిలో ఏ కొద్ది పాటు కూడా చోర కళ లేనట్లు ఇట్టే తెలిసిపోతుంది. అలాగే వారు ప్రొఫెషనల్ దొంగలు అస్సలే కాదన్న విషయం ఇట్టే అర్థం అయిపోతుంది.

అసలేం దొంగతనం జరిగింది. ఎక్కడ జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఏముందంటే.. వారిద్దరు ఇద్దరు వృద్ధ దంపతులు. ఓ షాపింగ్ మాల్ మధ్యలో నిల్చున్నారు. ఎస్కలేటర్ పక్కనే నిల్చున్నారు. పక్కనే ఓ పూల కుండీ కూడా ఉంది. ఆ లేడీ బామ్మ ఏదో పిక్స తీస్తున్నట్లుగా ఫోన్ పట్టుకుంది. అతడు చేతిలో కర్ర పట్టుకుని అటూ ఇటూ చూస్తున్నాడు. ఎవరూ లేరని, తమను ఎవరూ గమనించట్లేదని నిర్థారించకున్న తర్వాత ఏవరరూ ఊహించని ఒక వస్తువును దొంగలించారు. అదేదో బంగారమో, వజ్రమో కాదు. అది ఇంకేదో అత్యంత విలువైనది అస్సలే కాదు. అదో మొక్క. మాల్ మధ్యలో ఉన్న మొక్కను వారిద్దరూ దొంగలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel